కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు.

spritual organisations

కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు.
ఆథ్యాత్మిక సంస్థల్లోని కొన్ని నిజా నిజాలను తెలుసుకునే ముందు ప్రపంచంలో మనిషి అధికంగా వేటికి బయపడుతాడో ముందుగా తెలుసుకుందాం.
ప్రపంచంలో మనిషి అతిగా భయపడే 5 విషయాలు.
1) మరణం, మరణానంతర జీవితం.
2) అతి ఎత్తైన ప్రదేశం నుండి లొతుల్లోకి చూడడం
3) లోతు తెలియని నీళ్ళలోకి వెళ్ళడం.
4) చిమ్మ చీకటి ప్రయాణం
5) స్టేజి ఫీయర్.. తెలియని కొత్తవారి ముందు సభాముఖంగా మాట్లాడటం..
పై అయిదు భయాల్లో కొట్టొచ్చినట్లు కనపడే ఒకే ప్రధాన అంశం తనకు తెలియనిదానికి భయపడడం…
ఈ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తవుకు,సేవకు ఒక వెల ఉంది..దాని అవసరం ఐన వారు అందుకు తగ్గ వెల చెల్లించి దాన్ని కొనుక్కుంటారు..కాని జ్యోతిష్యంలో, ఆధ్మాత్మికతలో ముందుగా అంతా ఉచితమే అని చెప్పి , మీరు పొందిన సేవలకు , మీలాగే భవిష్యత్తులో అలాంటి సేవలు పొందేవారికి మీకు చేతనైనంతలో డొనేషన్స్ ఇవ్వండి అంటారు..ఇది ఒక్క పిరమిడ్ సొసైటిలో అనే కాదు, ప్రపంచంలో నూటికి 99 శాతం ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నదే..మనిషి తనకు తెలియని విషయాలు , అతి ప్రత్యేకించి మరణానంతర ఆధ్యాత్మిక విషయాల్లో సహజంగానే అయోమయం ఉండి, తనలో భయాలకు ఆలంభనగా ఉండే ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థలో కొనసాగడం, తనకు వీలైన మొత్తాన్ని సమర్పించుకోవడం ఎంతో కాలంగా కొనసాగే విషయమే..
అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉన్నది..ఆయన ఎవరిని నొరెత్తి రుపాయి డొనేషన్ అడుగలేదు..రుపాయి సంగతి పక్కన పెట్టండి కనీసం అన్నం కూడా అడుగలేదు..గొర్రెలు కాసే గొర్రెల కాపరిల ద్వార ఆనోట ఈ నోట తెలిసి ఎవరో ఒక మహా సాధువు కొండ మీద ధ్యానం చేసుకుంటున్నాడని, కిందా అరుణాచలంలో తెలిసి, ఒక ముసలావిడ అతనికి అన్నం పట్టుకుపోవడం మొదలైంది, బుద్దుడికి సుజాత అన్నం పెట్టినట్లు….రమణమహర్షి ఆశ్రమం కడుతానని అనలేదు..అతన్ని దగ్గరకు వచ్చేవారే చందాలు పొగేసుకుని ఆ ఆశ్రమాన్ని కట్టారు.
అధ్యాత్మిక సంస్థలు అన్ని ఆధ్మాత్మికత భోధించి అందరి దగ్గర డొనేషన్స్ అడుగుతున్నారు కదా… పోని ఎవరినైనా మీలో ఎవరికైనా డబ్బుల ఇబ్బంది ఉంటే ఈ సంస్థను అడగంటి వీలైన సాయుత మిస్తాం అని చరిత్రలో ఏనాడైనా అడిగారా?..అలాంటి ఒక్క సందర్భం చూపగలరా?
పోని నాకో 10 లక్షలు ఇవ్వండి,లేదా 10 కోట్లో,100 కోట్లో ఇవ్వండి. బ్యాంక్ వడ్డికంటే రెండు రెట్లు నేను ప్రతి నెల పిరమిడ్ సొసైటికి పే చేస్తాను..దాంతో పిరమిడ్ సొసైటి ఎవరి దగ్గర చందాలు తీసుకోసరంలేకుండా ( తిరుమలలో కదా నిత్యన్నదానం నడువడానికి కేవలం బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్లమీద వచ్చిన వడ్డీల మీదే నిత్యన్నదాన పథకం నడుస్తున్నట్లు) నేను ఈ వ్యవస్థను నడిపిస్తాను…100 శాతం సెక్యూర్ గా డబ్బు నష్టపోకుండా లాభసాటిగా ఇదేలా కొనసాగుతుందో నెను చెపుతాను..ఇది మీరు చేయగలరా? మాట్లాడితే అన్ కండీషనల్ లవ్ అంటారు…డబ్బు టాపిక్ వచ్చేసరికి మాత్రం..సెక్యూరిటి, ఇతరాత్ర మాట్లాడుతారు….
ఆత్మ గురించి స్వయంగా తెలుసుకోవడం,అనుబూతిచెందడం ఆత్మ జా్ొనం, సో జా్ొనం ఒక్కటే డబ్బు ఇవ్వదు. డబ్బు అనేది మరో రూపంలో ఉన్న దైవం. అదొక శక్తి స్వరూపం.. ప్రపంచంలో ఎలాంటి ఆధ్యాత్మికత తెలియని సగటు మనిషి కూడా దాని వెంట పడి పరుగులు తీసేది అందుకోసమే…ఆ డబ్బు అనే శక్తి దగ్గరుంటే మరణం పొందకుండా ఉండడం,ఆత్మజాొనం రావడం రెండు మినహా ప్రపంచంలో మిగితా ఏదైనా సాధ్యమే…..

ఏతా వాతా సారంశం…ధనం మూలం మిథం జగత్….. కాకపోతే ఈ అసలు వాక్యం మరొ రకంగా ఉంది అంతే..
దైవం మూలం మిథం జగత్…..
………………………..

1) నూటికి 99 శాతం సంస్థలు , భక్తులు, ఫాలోవర్స్ ఇచ్చే చందాల మీద నడిచేవే..
2.) మనిషికి వచ్చే రోగం ,నొప్పులు,మానసిక, ఆర్ధిక భాధలలకు అయా రంగాల్లో డబ్బులు తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్స్, జ్యోతిష్యుల, మానసికి రోగ నిపుణులు ఉన్నారు.
3. ) వీటన్నింటికి మించింది ఆధ్మాత్మిక భయం.. మనం ఎక్కడి నుండి వచ్చామా, చచ్చాక ఎక్కడికి పోతున్నామో, జీవితానికి అర్ధం ఏమిటో అర్థం కాని సమస్యలతో మిడిల్ క్లాసువారు బాధపడుతుంటారు.. బాగా డబ్బున్న వారికి , బాగా పేదవారికి వీటితో పని ఉండదు,వీటి అవసరం రాదు… మిడిల్ క్లాసువారు జీవితంలో ఏదో ఒక జీవిత సంఘటనతో నాకు ఇలా ఎందుకు జరిగింది , జరుగుతుంది అనే అన్వేషణలోనే ఈ ఆధ్యాత్మిక సంస్థల దగ్గరకు చేరుకుంటారు.
4) వీటిల్లో నిజమైన Soul Knowledge భోధించేవి 10శాతం ఉన్నాయి.. నిజమైన సోల్ నాలెడ్జి భోదించేవి సంస్థలు సహజంగానే శివాలయాల లాంటివి.. ఏ శివాలయం చూసిన సహజంగా శివుడికి ప్రతిరూపంలా పేదరికంతోనే ఉంటాయి..ఇలాంటి సంస్థలు నిజంగా ఉన్నాయి.కాని ఇవి శివలయాలాంటివే..పేదరికంతోనే ఉంటాయి.
5) 90శాతం సంస్థలు, ఉపనిషత్తులు,గీతలో ఉన్న ప్రామాణిక అంశాలను తీసుకుని,ఒక నయా భోధకుడి అవతారంతో అవే ప్రాధమిక అంశాలను అటు ఇటూగా మార్చి చెప్పి ,వారి దగ్గరకు వచ్చేవారిని లేని అయోమయంలోకి నెట్టి , బూమిమీద జీవితం కాకుండా, ఏదో చేస్తే, ఇంకేదో అయితే మరేదో అధ్భుత జీవితం ఉందనే అందమైన ఊహాలోకాల్లోకి మనసును క్రమేణా ఉసిగొల్పి , వారిని నమ్మి వచ్చిన భక్తులు ఫాలోవర్స్ దగ్గరే చందాల రూపేణా డబ్బులు తీసుకోవడం మొదలుపెడుతాయి.
రోగం నొప్పికి డాక్టర్ తీసుకునే ఫీజుకు లెక్క ఉంటుంది. కాని అగమ్య గోచర విషయాలు చెప్పడం ద్వారా భక్తులు సమకూర్చే నిధులకు అడ్డు అదుపు ఉండదు..డొనేషన్ల రూపంలో అపారమైన డబ్బు ఇక్కడ సమకూరుతుంది.. పదార్థ దర్మం ప్రకాం ఎక్కడ మాస్ ఎక్కువైతే అక్కడ ద్రవ్యరాశి పెరగుతుంది..నానాటికి భక్తుల,సంస్థ పెరుగుతుంది. ….. విడిగా ఆధ్యాత్మిక సంస్థల పేర్లు రాయదలుచుకోలేదు..మీ ఊహకు అందుతాయి..
కొందరు ఆధ్యాత్మికంలో దిగి డబ్బులు నష్టపోయానంటే ఆ స్థాయిలో నేను దైవాన్ని కొల్పోయాను.. దీనికి అంతర్గతంగా కూడా ఆధ్యాత్మికతే కారణం..కళ్ళ ఎదురుగా ఉన్న ప్రపంచం అంతా మిధ్య…అసలు ప్రపంచం పైన మరొకటి ఉంది అనే భోధనల పలితమే..భౌతిక జగత్తును నిర్యక్ష్యం చేయిస్తుంది.
మొన్న ఒక ఆథ్మాత్మిక కార్యక్రమానికి 3 రోజులు వచ్చిన వారిది భౌతిక శరీరంలో ఉండడం లాంటిది..వారి అసలు ఇల్లు, ఆత్మ లోక నివాసంలో ఎక్కడో వాళ్ళ ఊళ్ళో ఉంది…అలా అని 3 రోజుల జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా…ఆ 3 రోజుల నివాసినికి కూడా చలికి, వానకు తట్టుకునేలా నివాసం, దాహమైతే తాగడానికి నీళ్ళు,తినడానికి తిండి కావాలి. ఈ బౌతిక శరీరం అంతే..ఈ జన్మలో ఉన్నంత వరకు ఒక స్థిర నివాసం,ఇల్లు, వాహనం…జీవితం కొనసాగడానికి తిండి,బట్ట ఇతర అససరాలు తీర్చుకోవాలి.అందుకు తగ్గట్లుగానే జీవితం గడపాలి,వ్రుత్తి వ్యాపారాలు చేయాలి,దైవ రూపంలో ఉన్న డబ్బును సంపాదించాలి.
తమ జీవనాన్ని గడపాలి..ఇదంతా మిథ్యా అంటే ఎలా????????
ఆధ్మాత్మిక క్లాసులు విన్న చాలా మంది చెడిపోయేది ఇక్క్డడే . కళ్ళ ఎదురుగా ఉన్న జీవితం పక్కనపెట్టి మిథ్యా భ్రాంతిలో పైలోకాల్లోని జీవితం గురించి ఆలోచింపేలా చేసి, ప్రస్తుత జీవితంలో చేయాల్సిన ఘజని మహ్మద్ లాంటి పోరాట పటిమను నిర్వీర్యం అయ్యేలా చేస్తుంది.. అందుకే ఆధ్యాత్మిక గురువులంతా గమనించిండి, ఉన్నత ఆత్మ లోక జీవితం ఎంత ముఖ్యమో, ఈ శరీరంతో కొనసాగుతున్న ప్రస్తుత జీవితం అంతకంటే ముఖ్యమని మీ భవిష్యత్తు క్లాసుల్లో చెప్పడం మర్చిపోకండి… లేదంటే మనుషుల నిష్ర్కియ కర్మ తాలుకు కర్మ కూడా మీ అకౌంట్లో జమ అవుతూ పోతుంది.
టివిల మీద,పేపర్ల మీద దుమ్మెత్తి పోసిన దాన్ని మీరు కూడా ప్రతి క్లాసులో టీవి చూడడం,పేపర్ చదవడం దుమ్మెత్తిపోయకండి.ప్రాక్టీకాలిటి ముఖ్యం.. సెల్ ఫోన్ లను, ఇంటర్ నెట్ ను, పేపర్ , టీవి మీడియాను శుభ్రంగా వాడుకుంటాం..పైగా దాన్నే దుమ్మెత్తి పోస్తాం…సగటు మనిషి తన నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యల నుండి కాసేపు ఉపశమనానికి సినిమాకు వెళుతాడు,లేదా టివి చూస్తాడు..మానసిక ఉల్లాసం కోసం మాత్రమే…నేను హాలివుడ్ సినిమాలు మాత్రమే ఎక్కువ చూస్తాను.టి.వి.సీరియల్ మహా అయితే ఓ రెండు గంటలు మించి చూడలేదు అంటే నా ఫ్రీక్వెన్సీ స్థాయి ఎక్కువ కాబట్టి, టివి సీరియల్స్ చూసి ఆనందించే ప్రిక్వెన్సీలో నేను లేను కాబట్టి అనే సింపుల్ అర్థం..అదే నా ఇరువై ఏటా వారినికి 20 సీరియల్స్ వారపత్రికల్లో చదివేవాణ్ణి..ఆప్పటి నా ప్రీక్వెన్సి అది…ఇప్పటి నా ప్రీక్వెన్సి ఇది. ప్రజలంతా వారి ప్రీక్వెన్సీ స్థాియికి తగ్గదాంట్లోనే ఆనందం,మానసికి ఉల్లాసం వెదుకుంటున్నారు..ఆమాత్రం దానికి టివీలు చూడడం,పేపర్ చదవడం మీద అంతలా దుమ్మెత్తిపోయాల్సిన అవసరం..
ఏతా వాతా….ధనం మూలం మిథం జగత్….
ఆధ్యాత్మిక గురువులు సామన్యులు లాజిక్ గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదంటే దాంట్లో ఈ కింది సంభావ్యాలు ఉన్నాయి.
1) మీరు నిజంగా మేయిల్ చదువకుంటే అది మీ బాధ్యత రాహిత్యం , యుట్యూబ్,ఈమేయిల్ , ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాను వాడుకున్న మీరు, దాని ద్వార వచ్చిన ప్రశ్నకు ఏదో రూపంలో సమాధనం ఇవ్వాల్సిన కనీస నైతిక బాధ్యత మీమీద ఉంటుంది.
2) మీరు మేయిల్ చదివి కూడా సమాధానం ఇవ్వలేదంటే మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి అని….
సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద వస్తుంది..డబ్బు రాదు… నేను డబ్బు గురించి అడిగిన ప్రశ్నకు మీదగ్గర డబ్బు లేదు కాబట్టి సమాధానం ఇవ్వలేక పోయారు..అంతే…అంటే వ్యాపారం చేసి, డబ్బు సంపాదించిన తెలివితేటలతో కాకుండా లండన్ లైబ్రరిలో కూర్చుని పెట్టుబడి దారుడు ఎలా పుడుతాడు,కార్మికుడు ఎలా శ్రమ దొపిడికి గురౌతాడు , పెట్టుబడిదారుడు నశించి అందరు సమసమాజంలో ఉండాలంటే అందుకు కమ్యూనిజమే మార్గం అని కేవలం పాండిత్యంతో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు మ్యానిఫేస్టో తయారు చేసినట్లు ఉంటుంది ఇది…
ఇంతకు కార్ల్ మార్క్స్ కమ్యూనిజం మీద సైటర్ వేసిన నేను కమ్యూనిజం ఎందుకు కూలిపోయి, ఇంకా పెట్టుబడిదారి వ్యవస్థమాత్రమే ఎందుకు కొనసాగుతుందో చెప్పమంటారా?పెట్టుబడి దారుడు కార్మికుడి శ్రమ దొపిడి చేసి లాభాలు సంపాదించడం లేదు (దాస్ కేపిటల్ నా 20వ ఏట చదివాను) నేను అప్పడు అలాగే 20వ ఏట అనుకునేవాన్ని..నా 40వ ఏటా అర్థమైంది …పెట్టుబడిదారుడు లాభంపోందేది తన రిస్క్, తెలివితేటలకు మాత్రమే , అంతే కాని ఏ కార్మికుడి శ్రమ దోచి కాదు..
ఎంతో సరళమైన విషయం. I found the one truth as “Your profits is all ways proportionate to the risk.”

3)మీ చైతన్య స్థాయిలో ఇదంతా మీకు అర్థం చేసుకునే శక్తిలేదు పిచ్చివాడా…అందుకే సమాధానం చెప్పడం లేదు అని గురువులు అంటే సామాన్యుల దగ్గర సమాధానం లేదు.ఇదికూడ ఒక సంభావ్యతే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *