జెరోధాలో ఫండ్ డిపాజిట్ విత్ డ్రా చేయడం ఎలా? (జెరోదా How to deposit in Zerodha )
జెరోధాలో ఫండ్ డిపాజిట్ విత్ డ్రా చేయడం ఎలా? (జెరోదా How to deposit in Zerodha )
How to deposit and withdraw funds in Zerodha.
జెరోదాలో మీకు ట్రేడింగ్ అకౌంట్ ఒక్కసారి ఓపెన్ అయిన తరువాత మీ అకౌంట్ లో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలి విత్ డ్రా చేయాలి తెలుసుకుందాం.
మీకు జెరోదాలో అకౌంట్ లేకుంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
జెరోదాలో డిమాట్ అకౌంట్ అకౌంట్ ఫీజు రూ.200 మాత్రమే.మీకు కమోడిటీస్ లో కూడా అకౌంట్ కావాలనుకుంటే మరో 100 రుపాయలు మొత్తం 300 రుపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది.
జెరోదా అకౌంట్ మీకు ఆక్టివేట్ అయిన తరువాత మీకు లాగిన్ యుసర్ నేమ్ వస్తుంది.ఒక పాస్ వర్డ్ సెట్ చేసుకోండి.అలాగే 6 అంకెల ఒక 2FA.పిన్ టైప్ చేయండి.6 అంకెలు మీరు గుర్తుకు పెట్టుకునేవే వాడండి. 2FA పాస్ వర్డ్ కొన్ని బ్రోకరేజి సంస్థలలో మీ రిజిస్టర్ నెంబర్ కు డైలి ఎస్.ఎం.ద్వారా వస్తుంది. వీటిని మర్చిపోకుండా విడిగా మీ నోట్ బుక్ లో లేదా కంప్యూటర్ లో ఎక్కడైనా రాసుకోండి.
అకౌంట్ ఓపెనింగ్ చేసుకునేప్పుడే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది అనేది వివరించాలి. అలాగే ఆ బ్యాంక్ పేరు, బ్యాంకు బ్రాంచి మీ అకౌంట్ నెంబర్ , బ్యాంక్ లో అకౌంట్ హోల్డర్ గా మీకు ఏ పేరుతో ఉంటే అదే పేరు ఎంటర్ చేయాలి.దాంతో పాటు మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ చెక్ మీద కేన్సిల్ అని రాసి , ఆ చెక్ ను ఫోటో కూడా తీసి జెరోదాలో అప్ లోడ్ చేయాలి.ఇండియాలో ఉన్న అన్ని ఐ.ఎఫ్.ఎస్.సి.కోడ్ (IFSC is short for Indian Financial System Code)(+MICR Code) ఉన్న బ్యాంకుల అకౌంట్ల నుండి జెరోదా ట్రేడింగ్ అకౌంట్ లో డిపాజిట్ చేయవచ్చు అలాగే అదే బ్యాంకుకు విత్ డ్రా చేయవచ్చును.
మీరు అకౌంట్ఓపెన్ చేసినప్పుడు ఎంటర్ చేసిన బ్యాంక్ వివరాలు ,అప్ లోడ్ చేసిన కేన్సిల్డ్ చెక్ ను వారు క్రాస్ చెకింగ్ చేసుకుంటారు. మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ వివరాలు,చెక్ మీద ఉన్న వివరాలు సరిపోలకుంటే మీకు సరైన వివరాలు ఎంటర్ చేసుకోండని మేయిల్ వస్తుంది.మీరు ఒక బ్యాంక్ అకౌంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి మద్యలో మరో బ్యాంక్ అకౌంట్ కు మీరుఫండ్ విత్ డ్రా చేద్దామనకుంటే అలా కుదరదు. బ్యాంక్ అకౌంట్ చేంజింగ్ అప్లికేషన్ సబ్మిట్ చేసి,దానికి చార్జీలు కూడా పేచేయాలి.
జెరోదాలో 3 రకాలుగా ఫండింగ్ చేయవచ్చును.
ZERODHA DEPOSIT METHOD 1- Funding through Zerodha Kite/console after login it.
జెరోదా డిపాజిట్ 1వ పద్దతి : జెరోదా కైట్ లేదో కన్సోల్ లో లాగిన్ అయ్యి డిపాజిట్ చేయడం.
1వ పద్దతి :
జెరోదా కైట్ ఫ్లాట్ ఫాంలో లాగిన్ అయిన తరువాత అక్కడ కనపడే ఫండ్స్ మెను మీద క్లిక్ చేయండి.తరువాతడైరెక్టుగా ఈకింది 25 బ్యాంకు అకౌంట్ల ద్వారా ఆన్ లైన్ ఇన్ స్టాంట్ గా డిపాజిట్ చేయవచ్చును. డిపాజిట్ మీద రూ.9+ టాక్సెస్ కట్ అవుతాయి. ఈ బ్యాంకుల ద్వారా డిపాజిట్ చేస్తే మీ ట్రేడింగ్ అకౌంట్ లో మీరు ట్రాన్స్ ఫర్ చేసిన మొత్తం స్పాట్ లో మీ ట్రేడింగ్ అకౌంట్ లో కనపడుతుంది.
Axis Bank, City Union Bank,Deutsche Bank,Federal Bank,HDFC Bank,ICICI Bank,
IDBI Bank, Corporation Bank, Indusind Bank, J&K Bank, Kotak Mahindra,Yesbank,Indian Bank, Indian Overseas Bank, Karnataka Bank, Lakshmi Vilas Bank,Yes Bank,State Bank of India,Catholic Syrian bank, Dhanalaxmi Bank,Saraswat bank,TMB,Bank of Maharastra,IDFC Bank .
ZERODHA DEPOSIT METHOD 2- IMPS/NEFT/RTGS transfer Method.
జెరోదా డిపాజిట్ 2వ పద్దతి : ఐ.ఎం.పి.ఎస్. / నెఫ్ట్ ట్రాన్సఫర్ (IMPS/NEFT/RTGS transfer)
మీకు పైన కనపడేబ్యాంకుల్లో వేటిలో అకౌంట్ లేకుండా ఉండి దేశంలో ఉన్న ఇతర బ్యాంకులు,ప్రైవేటు బ్యాంకులు,ఇతర గ్రామీణ బ్యాంకులు,కో అపరేటివ్ బ్యాంకులు వాటిల్లో అకౌంట్ ఉంటే వాటిలో నెట్ బ్యాంకింగ్ ఆక్టివేట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ కు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అక్టేవేట్ చేసుకుని ఉంటే అప్పుడు మీరు ముందుగా మీ బ్యాంక్ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.అక్కడినుండి ముందుగా కింద ఉన్న జెరోదా బ్యాంక్
అకౌంట్లను ఆడ్ పేయిగా ముందుగా ఆడ్ చేసుకోండి.బ్యాంకు ను బట్టి ఒక్కో టైం లిమిట్ ప్రకారం అవి కన్ఫర్మ్ అవుతాయి.పేయి ఆక్టివేట్ అయిన తరువాత అప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్టుగా ఐ.ఎం.పి.ఎస్. / నెఫ్ట్ ట్రాన్సఫర్ ద్వారా ఫండ్ జెరోదాకు పంపవచ్చును. ఐ.ఎం.పి.ఎస్. / నెఫ్ట్ ట్రాన్సఫర్ పద్దతిలో మీరు ఫండ్ ట్రాన్స్ ఫర్ చేస్తే కొంచెం టైమ్ తీసుకున్న తరువాత మీ జెరోదా అకౌంట్లో ట్రాన్స్ ఫర్ చేసుకున్న ఫండ్ కనపడుతుంది.
Zerodha IMPS/NEFT/RTGS transfer (please click here if any account number changed in the zerodha website here.)
NSE/BSE (Equity, F&O, Currency) | MCX (Commodities) | |
Bank Name | HDFC Bank | HDFC Bank |
Account Title | ZERODHA BROKING LTD – CLIENT ACCOUNT | ZERODHA COMMODITIES PRIVATE LIMITED MCX |
Account Number | ZERNSE ? | ZERMCX ? |
Account type | Current account | Current account |
Bank Branch | Sandoz Branch, Mumbai | Sandoz Branch, Mumbai |
IFSC Code | HDFC0000240 | HDFC0000240 |
Alternate account details
NSE/BSE (Equity, F&O, Currency) | MCX (Commodities) | |
Bank Name | HDFC Bank | HDFC Bank |
Account Title | ZERODHA BROKING LTD – CLIENT ACCOUNT | ZERODHA COMMODITIES PRIVATE LIMITED |
Account Number | 57500000302010 | 05230340002150 |
Account type | Current account | Current account |
Bank Branch | HDFC Bank, Richmond road, Bangalore | HDFC Bank, Richmond road, Bangalore |
IFSC Code | HDFC0000523 | HDFC0000523 |
3వ పద్దతి : జెరోదాలో డిపాజిట్ యు.పి.ఐ.పద్దతి.
ZERODHA DEPOSIT METHOD 3- UPI METHOD – FREE AND FAST WAY.
ఈ పద్దతి అన్నింటికంటే సులభం.మీ మని ఇన్ స్టాంట్ గా మీ జెరోదా అకౌంట్లో కనపడుతుంది.
మీకు భీమ్ యు.పి.ఐ.లేదా గూగుల్ పే , ఫోన్ ఫే ఆప్ లలో మీ మోబైల్ లో వీటిని దేన్ని అక్టివేట్ చేసుకున్న సరే.ఈ అప్ లలో మీ ప్రోఫైల్ మీద క్లిక్ చేసారంటే మీ యు.పి.ఐ. ఐ.డి. కనపడుతుంది.
ఉదా.భీమ్ యు.పి.ఐ. అనేది కేంధ్ర ప్రభుత్వ ఆప్.దీన్నిమీ మోబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే మీకు ఏ మోబైల్ నెంబర్ తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో అదే మోబైల్ నెంబర్@upi అని ఉంటుంది.అలాగే గూగుల్ పే అకౌంట్ లో మీబ్యాంక్ ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకులింక్ ఉంటే మీ యు.పి.ఐ. ఐడి. మీపేరు@okicici అని ఉంటుంది.
మీ జెరోదా అకౌంట్లో లాగిన్ అయిన తరువాత ఫండ్స్ మెనులోకి వెళ్ళి ఆడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే కింద కనపడే యు.పి.ఐ. దగ్గరకు వెళ్ళి యు.పి.ఐ ఐడి ఎంటర్ చేయండి.పైన ఎంత మొత్తం డిపాజిట్ చేయాలో అమొత్తం ఎంటర్ చేయండ. వెంటనే మీ మోబైల్ ఉన్న ఆ యు.పి.ఐ.ఆప్ కు అలర్ట్ వస్తుంది.జెరోదానుండి ఇంత ఫండ్ డిపాజిట్ కోసం అని కనపడుతుంది.దాన్ని మీరు అప్రూవ్ చేయగానే వెంటనే మీజెరోదా అకౌంట్ లో మీరు డిపాజిట్ చేసిన ఫండ్ కనపడుతుంది.మీరు రూ.10 కూడా ట్రాన్స్ ఫర్ చేయండి మీకు చార్జీలు పడవు.ఈ పద్దతి లో ఫ్రీగా ఇన్ స్టాంట్ డిపాజిట్ చేయవచ్చు.
మనం ఇప్పటి వరకు 3 రకాలుగా మీ జెరోదా అకౌంట్ లో ఫండ్ ఎలా డిపాజిట్ చేయాలో చూసాం.
అలాగే ఇప్పుడు ఫండ్ విత్ డ్రా చేయడం కూడా ఎలాగో చూద్దాం.
How to Withdraw funds in Zerodha.
జెరోదాలో ఫండ్ విత్ డ్రా చేయడం ఎలా?
మీరు జెరోదాలో కైట్స్ ట్రేడ్ ఫ్లాట్ ఫాం లేదా కన్సోల్ లోకి వెళ్ళి ఫండ్స్ దగ్గరకు వెళ్లి విత్ డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి.అక్కడ ఫండ్ విత్ డ్రా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ కనపడుతుంది.మీరు విత్ డ్రాచేసిన డబ్బు డైరెక్టుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకే ట్రాన్స్ ఫర్ అవుతుంది.
ఈక్విటి లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లేదా కరెన్సీ ట్రేడ్స్ నుండి మీరు రాత్రి 8.30 లోపుగా విత్ డ్రా చేస్తేఅదే రోజు నైట్ రాత్రి 12గంటలకు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. కమోడిటీస్ అకౌంట్ నుండి విత్ డ్రా చేయదలచుకుంటే ఉదయం 8గంటల లోపు విత్ డ్రా చేస్తే అదే రోజు మద్యహ్నం 2గంటలకు మీ బ్యాంక్ అకౌంట్ కు ఫండ్ ట్రాన్స్ ఫర్ అయి వస్తుంది.
మని విత్ డ్రా చేసేప్పుడు ఒక విషయం గమనించండి.మీరు డెలివరి లో తీసుకున్న లేదా మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న షేర్లను సెల్ చేస్తే T+2 DAYS తరువాత మాత్రమే మీరు ఫండ్ విత్ డ్రా చేయగలరు.అంటే ఈ రోజు మీ డిమాట్ అకౌంట్ లోని షేర్లను సెల్ చేస్తే 3రోజుల తరువాత మాత్రమే మీకు విత్ డ్రాబుల్ ఫండ్ గా కనపడుతుంది. అప్పుడు మాత్రమే మీరు విత్ డ్రా చేయవచ్చును.
షేర్లను అమ్మిన మర్నాడే మీ ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బు కనపడుతుంది.వాటితో డే ట్రేడింగ్ కాని తిరిగి డెలివరి బేస్ డ్ స్టాక్ ట్రేడింగ్ చేయవచ్చును.డే ట్రేడింగ్ చేస్తే అదేరోజు మీ అకౌంట్ లాస్ లేదా లాభం సెటిల్ అవుతుంది.కాని డెలివరి పోజిషన్ తీసుకున్న షేర్లు ఎప్పుడైనా అమౌంట్ విత్ డ్రాచేయాలంటే T+2 DAYS అగాల్సిందే.ఈ విషయం బాగా గుర్తుకు పెట్టుకోండి.
ఈ దిగువ ఇమేజ్ చూడండి. జెరోదా కైట్ లో ఫండ్ డిపాజిట్ అండ్ విత్ డ్రా చేయడం ఎలాగో కనపడుతుంది. Image showing How to deposit and withdraw funds in Zerodha.