బంగారం ధర మన దేశంలో ఎందుకు పెరుగుతుంది?

బంగారం ధర మన దేశంలో ఎందుకు పెరుగుతుంది?

మనదేశంలో గోల్డ్ రేటు పెరగడం అనేది ముఖ్యంగా రెండింటి మీదా ఆధారపడి ఉంటుంది.

1.గోల్డ్ రేటు అనేది ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మూవ్ మెంట్ మీద  ఆదారపడి ఉండడం మొదటి కారణం.2.మన దేశంలో అమెరికా డాలర్ రేటు ఇండియన్ రుపాయల్లో ఎంత ఉంది అనే దాని పైన రెండో కారణం అదారపడి ఉంటుంది. దేశంలో ట్రేడింగ్ జరిగే మల్టికమోడిటి ఎక్సేంజి( ఎం.సి.ఎక్స్) గోల్డ్ ఇతర మెటల్స్ రేట్లు ఈ రెండింటి బేస్ మీదనే అధారపడి నడుస్తుంటాయి,అంతర్జాతీయంగా గోల్డ్ రేటు పెరుగుతుంటే మన దేశంలో పెరుగుతుంది, అక్కడ దర తగ్గితే మన దగ్గర కూడా తగ్గుతుంది.(అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గినా అమెరికా డాలర్ తో రుపాయి విలువ తగ్గిన కూడా మనందేశంలో గొల్డ్ రేటు పెరుగుతుంది.) ఇంటర్నేషనల్ గోల్డ్  ప్రధానంగా లండన్,న్యూయార్స్ మెటల్ ఎక్సేంజీల రేటును బేస్ చేసుకుని నడుస్తుంటాయి..ఇంటర్నేషనల్ గోల్డ్  ను అమెరికా డాలర్స్  తో 1 ఔన్స్   ప్రమాణికంగా (మనదేశంలో 10 గ్రాములు లేదా తులం ప్రమాణికం అయినట్లు) ట్రేడింగ్ నడుస్తుంది..1 ఔన్స్ అంటే సుమారుగా 31 గ్రాములు.. అంటే 3 తులాల మీద 1 గ్రాము..

మీరు గూగుల్ లో gold price usd today  అని సెర్చ్ చేయండి. ఆ రోజు లైవ్ గా ఉన్న రేటు చూపిస్తుంది.   ఉదా ఈ రోజు అంటే 31 అక్టోబర్ 2020న శనివారంరోజున ..1 ఔన్స్ గోల్డ్  ఇంటర్నేషనల్ గా 1878.60  డాలర్లు  దగ్గర నిన్న శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర రేటుచూపిస్తుంది(శని ఆదివారాల్లో మార్కెట్ ఉండదు)ఉంది. కింద చార్ట్ చూడండి.

gold price showing today rate chart easily understandable

అలాగే గూగుల్ లో usd inr rate  today అని సెర్చ్ చేయండి. ఈ రోజు అమెరికా డాలర్ తో ఇండియన్ రుపాయి మారకం విలువ రూ. 74.55 అని చూపిస్తుంది.అంటే ఈ రోజు ఒక్క అమెరికా లేద యు.ఎస్.డాలర్ కోనాలంటే మీరు రూ.74.55 పైసలు చెల్లించాలి.నోట్లరూపంలో డాలర్లు  తీసుకోవాలంటే బ్యాంక్  చార్జీలు అదనంగా ఉంటాయి.పైరేటు ఆన్ లైన్ రేటు మాత్రమే.కింద చార్ట్ చూడండి.

usd inr price today showing to easy understanding the chart ,rate as on 31-10-2020

ఇప్పుడు ఈ రేట్లను మనం రూపాయల్లోకి మార్చి చూద్దాం.ఇంటర్నేషనల్ గొల్డ్ రేటు 1878.60 డాలర్లు x  ప్రస్తుత డాలర్ రేటు రుపాయితో74.55 రుపాయలు గుణించండి = 1,40,049.63 రుపాయలు.(ఒక లక్ష 40వేల నలుబై తొమ్మిది రుపాయలు.63పైసలు) ఇది 1 ఔన్స్ బంగార ధర  రుపాయల్లో..దీన్ని మన దేశంలో 10 గ్రాములు,తులం లెక్కలో కొలుస్తుంటారు. పైన ఒక ఔన్స్( 31 గ్రాముల రేటు చూసాము) ఇప్పుడు తులం అంటే 10గ్రాముల రేటుకు విభజించండి. కాబట్టి 1,40,049.63 /3 = రూ.46,683.21  వస్తుంది..

మనం 31గ్రాములను 3వంతులుగా అంటే 10గ్రాములుగా మాత్రమే విభజించాం. పైన మిగిలిన ఇంకో 1గ్రాము  గ్రామును కూడా /3  గుణించాలి. లేదంటే  దానికి అదనంగా గవర్నమెంట్ విధించే టాక్స్ లను కలపాలి. ఆలెక్కన చూస్తే ఈ రోజు 31-10-2020న గోల్డ్ రేటు మన దేశంలో రూ.50,900 గా ఉంది.కింద చార్ట్ చూడండి.

rupee price per 1 usd showing in rupees, as on 31-10-2020

అంతర్జాతీయంగా గోల్డ్ రేటు మూవ్ మెంట్స్ మీద+ డాలర్ రుపాయి ఎక్సేంజి వాల్యు మీదనే ,మన దేశంలో గోల్డ్ రేటు ఆధార పడుతుందని మనకు అర్ధమవుతుంది. గత చరిత్రను పరిశీలిస్తే అమెరికా డాలరు, ఇండియన్ రుపాయి రేటు..2010 సంవత్సరంలో డాలరు రేటు 45 రుపాయలుగా ఉన్నప్పడు , అంతర్జాతీయంగా గోల్డ్ రేటు 1910 డాలర్లగా ఉన్నప్పడు మనదేశంలో గోల్డ్ రేటు రూ. 28,000 గా ఉండేది. అలాగే గోల్డ్ రేటు అంతర్జాతీయంగా 2012 తిరిగి 1600 డాలర్లు పడిపోయినప్పుడు మనదేశంలో గోల్డ్ రేటు అదే మాదిరిగా తగ్గకుండా అంతే ఉంది. కారణం అదే సమయంలో డాలర్, రుపాయి రేటు గత  2012లో రూ.54 పెరిగింది.అంతర్జాతీయంగా గోల్డ్ రేటు 300 డాలర్లు పడిపోయిన కూడా మనదేశంలో అదే రు.28000 ఉండడానికి కారణం ఈ లోపు రుపాయితో పోలిస్తే డాలర్ రేటు పెరగడం…అదే రూ.45లో డాలర్ రేటు ఉంటే తిరిగి రూ.21 వేలకు గోల్డ్ రేటు మనదేశంలో పడిపోయేది..అలా పడిపోకుండా ఉండడానికి ఏకైక కారణం  రుపాయితో పోలిస్తే డాలర్ బల పడడం. 6 ఆగస్టు 2020లో గోల్డ్ రేటు అంతర్జాతీయంగా 2075 యు.ఎస్. డాలర్ల వరకు పెరిగి ఇప్పుడు  1850-1900 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆగస్టు నుండి పోలిస్తే అంతర్జాతియంగా ఇప్పుడు 300 డాలర్ల వరకు తగ్గింది కాబట్టే మనదేశంలో కూడా రూ.55,000 డాలర్లవరకు పెరిగిన బంగారం దర ఇప్పుడు దిగివచ్చి రూ.50,000 రేంజిలో ఉంది.

డాలర్ రేటు కూడా అగస్టు రేటే 74.55 ఉంది కాబట్టే ఈ మాత్రం ఐనా బంగారం దర  కొంచెం తగ్గి తక్కువగా కనపడుతుంది. అదే  డాలర్ ఈ సంవత్సరం ఎప్రిల్ నెలలో మాదిరిగా 77.38 కు తిరిగి చేరుకుంటే బంగారం దర తిరిగి 55,000 చేరుకుంటుంది. ఒక వేల గొల్డ్ రేటు అంతర్జాతియంగా మరింత తగ్గి ఏ 1500 డాలర్లకు పడిపోతుందనుకోండి.ఈలోగా డాలర్ రేటు రుపాయితో ఏ 80రుపాయలకో చేరుకుందనుకోండి. మనకు అదే రూ.55,000 రేటులోనో కాదు ఏకంగా రూ.60,000 వరకు వెళ్ళిన ఆశ్చర్య పడనవసరం లేదు.

మనం డాలర్ రేటుతగ్గాలని ఆశిస్తే బంగారం వరకు లేదా క్రూడ్ ఆయిల్ వరకు బాగానే ఉంటుంది కాని,మన సాఫ్ట్ వేర్ ఎగుమతులవిషయంలో సాప్ట్ వేర్ సంస్థలన్ని బాగా లాస్ అవుతాయి.విదేశాల నుండి మనకు డాలర్ల రూపంలో పంపే ప్రతి డాలరు విలువ తగ్గిపోతుంది.మీ వాళ్ళు అమెరికా నుండి ఇంతకు ముందు ఓ 1000 డాలర్లు పంపిస్తే ఇప్పుడున్న ప్రకారం రూ.74000 అయ్యేది కొంచెం , యు.ఎస్.డాలరు 60 రుపాయలకు చేరుకుంటే మీకు అప్పుడు 14,000 తగ్గి రూ.60,000 మాత్రమే వస్తాయి. ఒక దేశ కరన్సిరేటు నిర్ణయించడానికి అనేక వందల ఇతర అంశాలు కూడా ఆదారపడిఉంటాయి కాబట్టే ప్రభుత్వాలు,ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ సాదరాణంగా ఈ ఎక్సేంజి రేటువిషయంగా మాటిమాటికి జోక్యం చేసుకోకుండా మార్కెట్ +దేశీయ ఆర్థిక బలబలాలకే వదిలేస్తుంటాయి.ఎప్పుడో అసాదారణ అర్థిక పరిస్థితులు తలత్తినప్పుడే మనదేశంలో యు.ఎస్. డాలర్ ఎక్సేంజి రేటును ప్రభుత్వం ఆర్.బి.ఐ.ద్వారా మారుస్తుంటుంది. ప్రపంచందేశాలన్ని దాదాపుగా యు.ఎస్.డాలర్ రేటునే ప్రమాణికంగా తీసుకుని ఆయా దేశాల కరెన్సీ రేట్లను నిర్ణయిస్తుంటాయి.

1991లో ప్రధానమంత్రిగా పి.వి.నర్సింహరావు ఉన్నప్పుడు   జూలై మొదటి వారంలొ రెండు విడుతలుగా యు.ఎస్.డాలర్ విలువను రూ.21.14 నుండి రూ.25.95 కు తగ్గించడం జరిగింది.అంటే 1000 డాలర్స్ కొనాలంటే జూన్ 1991 లో 21000 చెల్లించేది కొంచెం జూలైలో దాదాపు 26000 చెల్లించాల్సివచ్చేది.ఎందుకు ఇలా తగ్గించడం అంటే విదేశాలకు ఎగుమతుల రూపంగా చేసేవాటికి మరింతి ఎక్కువ డబ్బు రాబట్టడం,వేరేదేశాలనుండి పంపే డాలర్లు రుపాయల్లో విలువపెరగడం, విదేశి మారక నిల్వలు పెంచడం తద్వార  దేశ ఆర్థికస్థితిగతులను పెంచడం లాంటిఅనేక విషయాలు దీంట్లో దాగిఉంటాయి.ఆర్థిక శాస్ర్తం బహులోతైనది.1991లో మనదేశ ప్రధానిగా పి.వి.వచ్చేనాటికి అంతర్జాతీయంగా మన దేశా ఆర్ధిక పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందంటే మన దేశ విదేశి మారక నిల్వలన్ని పూర్తిగా కరిగిపోయి విదేశాలకు పేమెంట్స్ చేయాలంటే కూడా అకౌంట్ లో డబ్బులు లేకుండా ఉండేది.అప్పుడు అంతర్జాతియంగా మనకు ఎవరు అప్పు ఇచ్చే నాధుడు కూడా లేకపోవడంతో పి.వి.గారు ఆర్ధికమంత్రి మన్మోహన్ సింగ్ తో చర్చించి 200 టన్నుల బంగారాన్ని ఫ్లైట్ లో ఇంగ్లాండ్ కు తరలించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తాకట్టు పెట్టారు.ఆలా 200 టన్నుల బంగారం తాకట్టు పెట్టిగా వచ్చిన డబ్బుల తోనే ఆనాడు మనదేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి క్రమంగా పట్టాలెక్కింది. ఆలాంటి విపత్కర పరిస్థితి ముందు ముందు దేశానికి తిరిగి రాకుడదని పి.వి.+మన్మోహన్ ద్వజం తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల పలాలనే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.1933వరకు కూడా అమెరికా ,ఇంగ్లాండ్ లలో దేశంలో ఎంత రిజర్వ్ గోల్డ్ ఉంటే అంతే కరెన్సీ ని ముద్రించేవారు,గోల్డ్ రిజర్వు మాత్రమే ప్రమాణికంగా ఉండేది.తరువాత దీన్ని ప్రభుత్వం నిర్ధారించిన కరెన్సి విలువగా(Fiat Money) మార్చారు.

మన అందరికి కూడా ఇలాంటి అనుభవం జీవితంలో ఎప్పుడో ఓనాడుఅనుభవించే ఉంటాం. మన దగ్గర ఉన్న ఆస్తులు,పరపతిఏమి పనిచేయలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నబంగారం బయట అమ్మివేసిన లేదా తాకట్టు పెట్టిన తక్షణం డబ్బు వస్తుంది.మనవాళ్ళకు బంగారం విలువ బాగా తెలుసు కాబట్టే దాన్ని దాచుకోవడం మీద ఎక్కడలేని ప్రేమ ఉంటుంది.అందుకే పెళ్ళిళ్ళలో బంగారం కూడా విడదీయరాని అంశమై ఉంటుంది.

మన దేశంలో రుపాయి -డాలర్  ఫారెక్స్ మార్కెట్ ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది..ఆ సమయంలో ఇంటర్నేషనల్ గోల్డ్  ప్రైస్ చార్టు, మన దేశంలో గోల్డ్  ప్రైస్ చార్టు రెండు పక్క పక్కనే పెట్టకుని చూస్తే …ఇంటర్నేషన్ ల్ గా గోల్డ్ పెరుగుతుంటే , మన గోల్డ్ రేటు పడిపోవడం,ఇంటర్నేషనల్ గా పడిపోతుంటే మన దగ్గర పెరిగిపోవడం గమనించ వచ్చును. కారణం ఏమంటే ఆ టైమ్ లో యు.ఎస్.డి.-ఐ.ఎన్.ఆర్ ట్రేడింగ్ నడుస్తుంది , డాలర్ రేటు ఆ టైమ్ లో పెరగడం తగ్గడం మీద ఆదార పడి మన దేశ గోల్డ్ రేటు ఆదారపడి ఉంటుంది. కాబట్టి మనదేశ  మల్టి కమోడిటి ఎక్సేంజి ఆ టైమ్ లో ఇంటర్నేషనల్ గోల్డ్  రేటుతో పాటు,యు.ఎస్ .డాలర్ ఇండియన్  స్పాట్ రేటుతో లింక్ అయి నడుస్తుంది కాబట్టి ఈ తేడా వస్తుంది..సాయంత్రం 5 గంటలకు డాలర్ తో రుపాయి ట్రేడింగ్ ఉండదు కాబట్టి ఇంటర్నేషనల్ గోల్డ్  మరియు మన దేశంలో గోల్డ్ రేటు ఒకే మాదిరి అప్ డౌన్ మూవ్ మెంట్స్ తో కొనసాగడం ప్రత్యక్షంగా గమనించవచ్చును.

మన దేశ టైమ్ ప్రకారం  సాయంత్రం 6 గంటలకు అమెరికా మార్కెట్  ఓపెన్ అవుతుంది . యూరప్ మార్కెట్   రాత్రి 10 గంటలకు క్లోస్ అవుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రపంచంలోని బిగ్గెస్ట్  ఆర్ధిక వ్యవస్థలు ట్రేడింగ్ లో పాల్గొంటాయి కాబట్టి ఆ టైమ్ గోల్డ్ ,సిల్వర్ ఇతర మెటల్స్  మూవ్ మెంట్స్  సూపర్ ఫాస్ట్  గా మూవ్ అవడం కమోడిటి ట్రేడర్స్  అందరికి అనుభవంలో ఉన్న విషయమే..

సారంశం: బంగారం దర మన దేశంలో తగ్గాలంటే ఒకే మార్గం…అంతర్జాతియంగా గోల్డ్ రేటు యు.ఎస్.డాలర్ తో 1000-1500 ప్రైస్ రేంజిలో ఉండాలి.యు.ఎస్.డాలర్ తో రుపాయి ఎక్సేంజి 50 రుపాయల రేంజిలో ఉండాలి. అప్పుడు గోల్డ్ రేటు రూ.30,000 వేల రేంజికి తిరిగి పడిపోతుంది. ఆసక్తికరమైన విషయం మనదేశానికి స్వాతంత్రం వచ్చన 1947లో యు.ఎస్.డాలరుకు సుమారు రూ.4గానే ఉండేది.2020 నాటికి ఇది రూ.75కు చేరుకుంది.

గోల్డ్ ట్రేడింగ్ లో గోల్డ్ పెరగడం తగ్గడం ఇన్ని రకాల జాతీయ,అంతర్జాతీయ అంశాల మీద ఆదార పడి ఉంటుంది.అంతేకాని చాలా మంది అనుకునేట్టు పెళ్ళిళ్ళు,శుభముహర్తాలు లేవు కాబట్టి ఆషాడ మాసానికి తగ్గడం కాని, తరువాత మంచి రోజులు వచ్చినయి కాబట్టి. శ్రావణ మాసానికి పెరగడం జరుగదు…రవీందర్.

గత 10 సంవత్సరాల్లో గోల్డ్ రేట్ హెచ్చుతగ్గులను మంత్లిచార్టులో చూడండి. చార్టులో కనపడే ఒక్కో క్యాండిల్ ఒక్కో నెలను చూపిస్తుంది.

gold price historical chart last 10 years, showing in usd monthly chart to understand easy last 10 years price.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!