మొదటిసారి ఫ్లైట్ ప్రయాణం చేసేవారికి పూర్తి సలహాలు-సూచనలు- జాగ్రత్తలు.

మొదటిసారి ఫ్లైట్ ప్రయాణం చేసేవారికి పూర్తి సలహాలు-సూచనలు- జాగ్రత్తలు.
మొదటి సారి ఫ్లైట్ జర్ని చేసేవారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏయిర్ పోర్టుకు లోపలికి వెళ్లిన తరువాత ప్రాసెస్ ఎలా ఉంటుంది.ఎంచేయాలి ఫ్లైట్ ఎలా ఎక్కాలి అని. వాటన్నింటిని ఇక్కడ సులభంగా అర్థం చేసుకుందాం.ఉదాహారణకు హైదరాబాదులోని షంషాబాద్ ఏయిర్ పోర్టు లేదా రాజీవ్ గాంది ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు Rajiv Gandhi International Airport (RGIA) లేదా GMR-Hyderabad International Airport Limited (GHIAL) లో ప్రయాణం గురించి తెలుసుకుందాం.
* ఎంత టైమ్ ముందు చేరుకోవాలి?
మీరు దేశీయంగా ప్రయాణం చేస్తుంటే కనీసం 2లేదా 3గంటలముందు చేరుకోవాలి. అదే ఇంటర్నేషనల్ ప్రయానం చేసేవారైతే కనీసం 4 లేదా 5గంటల ముందు చేరుకోవాలి. ఇప్పడు కరోనా సమయంలో కోవిడ్ టెస్టులు రిజల్ట్ టైం ఇవన్ని లెక్క వేసుకుంటే ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేసేవారు 10గంటల ముందు చేరుకోండి.ఒక వేళ 24గంటల ముందేమీరు కరోనా నెగెటీవ్ రిపోర్టుతో వస్తే 4,5గంటల ముంద చేరుకుంటే చాలు.
*ఎక్కడ దిగాలి?
దేశీయంగా ప్రయాణం చేసేవారు షంషాబాదు డొమెస్టిక్ టెర్మినల్ లో ఏయిర్ పోర్టులో అన్నింటి కంటే పై ఫ్లోర్లో డిపార్చర్ దగ్గర డైరెక్టుగా దిగవచ్చును.
అదే ఇంటర్నేషనల్ ప్రయాణం చేసేవారు Interim International Departures Terminal (IIDT) ముందు దిగాలి.
• ఎక్కడ ఎంటర్ కావాలి? ఎంట్రెన్స్ లో ఏమేం చూపించాలి?
డొమెస్టిక్ లేదా దేశీయంగా ట్రావెల్ చేసేవారు డొమెస్టిక్ టెర్మినల్ లో ఏయిర్ పోర్టులో అన్నింటి కంటే పై ఫ్లోర్లో డిపార్చర్ దగ్గర దిగి అక్కడ కనపడే ఎంట్రినెంబర్.1,23 లలో దేని ద్వారా నైనా లోపలికి వెళ్ళ వచ్చును.కారు,క్యాబ్,బస్ దేంట్లో వచ్చిన కూడా ఈ పాయింట్ వరకు డైరెక్టుగా రావచ్చును. ఏయిర్ పోర్టుకు రావడానికి మీ స్వంత కారులో కాని లేదా మీరు స్వంతంగా క్యాబ్ బుక్ చేసుకుని కాని లేదా RTC Airport busses from JBS,JNTU,MIYAPUR,BHEL,UPPAL etc పాయింట్లనుండి బయలుదేరే బస్సల్లో కాని ఎవరి వీలు ప్రకారం వారు రావచ్చు. ఖచ్చితంగా 2,3 గంటల ముందు చేరుకుని ఎంట్రినెం.1,2,3నుండి లోనకు వెళ్ళెప్పుడు మీ ప్రింటెడ్ ఫ్లైట్ టికెట్ కాని లేదా మీ మొబైల్ లో ఉన్న ఎలక్ట్రానిక్ ఈ టికెట్ తో దాంతో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, వోటర్ ఐ.డి. లేదా పాస్ పోర్టు చూపించి లోనకు వెళ్ళవలెను.అయా కౌంటర్లలో లోపలికి పోవడానికి ముందే మీ టికెట్ , ఒరిజినల్ ఐ.డి.కార్డు తీసి జేజులో రెడిగా పెట్టుకోండి.
• లోనికి వెళ్ళిన తరువాత ఏంచేయాలి ? ఏ కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి?బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలి?
లోనకు వెళ్ళగానే A,B,C,D,E,F, Rows లలో మీరు ప్రయాణించబోయే ఇండియన్ ఏయిర్ లైన్స్ ,ఇండిగో, గో ఏయిర్, స్పైస్ జెట్, విస్తారా, ఏయిర్ ఆసియా తదితర విమాన యాన సంస్థల కౌంటర్లు ఉంటాయి. మీరు వాటిల్లో ప్రయాణం చేయబోతుంటే ఆయా కౌంటర్ల దగ్గరకు చేరుకోవాలి. మీ టికెట్ , ఐ.డి.కార్డు చూయించగానే మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇక్కడే బోర్డింగ్ పాస్ తీసుకోని మీ ప్రయాణం ముగిసి మీరు ఇంటికి చేరుకునేవరకు ఈ బోర్డింగ్ పాస్ ను జాగ్రత్తగా భద్రపరుచుకోవలెను. .ఆలస్యం లేకుండా ముందుగా వచ్చిన వారు అదనం ఖర్చులేకుండా విండో సీట్స్ కూడా పొందవచ్చును.మీహండ్ బ్యాగెజ్ దగ్గర ఉంచుకొని మీదగ్గర ఉన్న పెద్ద సూట్ కేసులు,బ్యాగులు ఇక్కడే కౌంటర్ లో ఇవ్వండి వారు బరువు చూసి అదనంగా మీ లగేజి బరువు ఉంటే అదనపు చార్జీలు వేస్తారు.సాదరణంగా 15 కిలోల వరకు అదనపు చార్జీ లేకుండా ప్రయాణం చేయవచ్చును.
• లగేజిలో ఏం పెట్టకూడదు.పవర్ బ్యాంకులు,కత్తెరలు,అగ్గిపెట్టలు. బోర్డింగ్ పాస్ మీద లగేజి అక్నాలెడ్జ్ స్టిక్కర్…
మీరు లగేజి అక్కడ అప్పగించేప్పుడు కత్తెరలు,బ్యాటరీలు,మొబైల్ పవర్ బ్యాంకులు, నిప్పు అంటుకునేవి,లిక్విడ్ కెమికల్స్ లాంటివి లగేజిలో పెట్టకూడదు. వారు మీ బ్యాగు,సూట్ కేసు తీసుకోగానే ఆ బ్యాగుకు ఒక స్టిక్కర్ , మరో అక్నాలెడ్జ్ స్కిక్కర్ మీ బోర్డింగ్ పాస్ టికెట్ వెనుక అతికిస్తారు. లగేజి అక్నాలెడ్జ్ స్టిక్కర్ మీబోర్డింగ్ పాస్ వెనుక అతికించారో లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మొబైల్ పవర్ బ్యాంకుల లాంటివి మీతో పాటే హ్యండ్ బ్యాగేజిలోనే పెట్టుకోండి.మీ వెంట తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగేజి సుమారు 7 కిలోలు అనుమతిస్తారు.మీ మొత్తం లగేజి 7 కిలోలవరకే ఉంటేడైరెక్టుగా ఆ బ్యాగు ను డైరెక్టుగా ఫ్లైట్ లోకే తీసుకెళ్ళవచ్చును.మీ హ్యండు బ్యాగులో అగ్గిపెట్టలు,కత్తెరలు ,బ్లేడులు లాంటివాంటిని అనుమతించరు.షేవింగ్ కిట్ లో కత్తెరలు , బ్లేడులులాంటివి మీవెంట హ్యాండు బ్యాగులో ఉంచుకోకుండా మీరు అక్కడ వదిలిపెట్టే చెకిన్ లగేజ్ లో నే వాటని పెట్టండి. అలాగే మొబైల్ పవర్ బ్యాంకు లాంటి వాటిని చెకిన్ లగేజిలో కాకుంగా మీ హ్యాండు బ్యాగులో పెట్టుకోండి.అలాగే హ్యాండ్ బ్యాగులో ఫుడ్ ఐటంస్,టిఫిన్స్ , వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు.ఏయిర్ పోర్టు లాంజిలో కాని ఫ్లైట్ లో కూర్చున్న తరువాత కాని మీరు ఇంటినుండి తెచ్చుకున్న టిఫిన్ తినవచ్చును. ఇందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. చివరగా మీలగేజి అక్కడ కౌంటర్ లో ఇచ్చి బోర్డింగ్ పాస్ తీసుకుని తరువాత ముందుకు వెళితే మరో అంచెను దాటాలి.అదే సెక్యూరిటి చెక్…
• సెక్యూరిటి చెక్ అంటే ఏమిటి? ఇక్కడ ఏంచేయాలి?
మీ బోర్డింగ్ పాస్, మీ హ్యండు బ్యాగు సెక్యూరిటి చెక్ పాయింట్ దగ్గరకు చేరుకోవాలి.ఇక్కడ ఉండే రెండు సెక్యూరిటి పాయింట్స్ లలో దేంట్లో క్యూలైన్ తక్కువగా ఉందో చూసుకుని అక్కడ లైన్ లో నిలబడండి. బోర్డింగ్ పాసు తీసుకోగానే అంతా సెక్యూరిటి చెక్ఇన్ కు నిలబడి చెక్ చేయించుకోవాలి.ఈ ప్రాసెస్ సుమారుగా గంట, ఏయిర్ పోర్టులో ప్యాసెంజెర్స్ ఎక్కువ ఉంటే ఒక్కోసారి గంటన్నర కూడా పడుతుంది. అందుకే 2,3 గంటల ముందు ఏయిర్ పోర్టుకు ముందేచేరుకోవాలని మరి చెప్పేది .సెక్యూరిటి చెక్ ఇన్ లో మీ హ్యండ్ బ్యాగ్ , నడుంకు ఉన్న బెల్ట్ ,మనీ పర్స్ ఒంటిమీద డ్రెస్ తప్ప మరేమి లేకుండా అక్కడ ఉండే ట్రేలో పెట్టి సెక్యూరిటి స్కానర్ లోకి పంపాలి.మీ లగేజిని,మిమ్మల్ని మెటల్ డిటెక్టర్ తో సహా క్షుణ్ణంగా చెక్ చేసి,మీ బోర్డింగ్ పాస్ ను స్కాన్ చేసి లేదా స్టాంపింగ్ వేసి పోలీసులు లోపలికి పంపిస్తారు.లేడీస్ కు సెపరేట్ లైన్ ఉంటుంది.మెటల్ డిటెక్టర్ తోపాటు ఫిజికల్ గా కూడా సాదారణంగా చెక్ చేస్తుంటారు.
సెక్యూరిటి చెకింగ్ అయిపోగానే బెల్ట్ మీద వచ్చే మీ ట్రే జాగ్రత్తగా తీసుకుని తిరిగి మీ మొబైల్,పర్సు,బెల్ట్ ,మీ హ్యండ్ బ్యాగ్ లాంటివి తిరిగి అన్ని మర్చిపోకుండా తీసుకోండి.కొంతమంది ఇక్కడే ఏమని పొరపాటు పడుతారంటే హ్యాండ్ బ్యాగ్ మీరు కూర్చున్న ఫ్లైట్ లోకి తీసుకు వచ్చి ఇస్తారని. అక్కడ పోలీస్ వారు చెక్ చేయగానే మీకు సంబందించినవన్ని మీ బోర్డింగ్ పాస్ తో సహా అన్ని ప్రతీది తీసుకోవాలే తప్ప మీకు ఏది కూడా ఇక్కడ నుండి తీసుకువచ్చి ఇవ్వరు. మీరు లగేజ్ కౌంటర్ లో వదిలిపెట్టిన చెకిన్ లగేజి మాత్రమే మీకు ఫ్లైట్ దిగినాక తిరిగి తీసుకోవచ్చు.అదితప్ప మీతో ఉన్న ప్రతీది మీతోపాటే జాగ్రత్తగా ఉంచోవాలి.
• గేట్ నెంబర్ ఎంత? ఆలస్యం చేయకుండా ఫ్లైట్ ఎక్కడం ఎలా?
• మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేప్పుడు దాంట్లో మీరు ఫ్లైట్లో కూర్చునే సీటు నెంబర్ అలాగే గేట్ నెంబర్ కూడా ప్రింట్ చేసి ఇస్తారు.ఏ గేట్ నెంబర్ కు ఇచ్చారో మీ బోర్డింగ్ పాస్ మీద చూసుకుని ఆగేట్ దగ్గరకు వెళ్ళి వేయిట్ చేయాలి.లోపల కూడా వాష్ రూంస్ ఉంటాయి. బోర్డింగ్ పాస్ ఇచ్చారు,సెక్యూరిటి చెక్ ఇన్ ఐపోయింది హమ్మయ్య ఇక ఎప్పడైనా ఫ్లైట్ ఎక్కవచ్చును అని అక్కడ కనపడే షాపుల్లో చూస్తూ తిరగవద్దు.భవిష్యత్తులో ఏ ఫ్లైట్ ఎక్కేప్పుడు కూడా(డొమెస్టిక్ దేశీయ సర్వీసుల్లో) బోర్డింగ్ పాస్ తీసుకుని,సెక్యూరిటి చెక్ అయ్యాక కూడా ఖచ్చితంగా 30-45 నిమిషాల ముందే మీ ఫ్లైట్ కు అలాట్ చేసిన గేట్ దగ్గరకు చేరుకోవాలి.మీ బోర్డింగ్ పాస్ చేక్ చేసి ఫ్లైట్ లోకి అనుమతించాక,లగేజి సర్దుకుని సీట్లోకూర్చుని, ఫ్టైట్ సెక్యూరిటి సూచనలు విని,రన్ వే మీద విమానం రెడిగా పెట్టి టెకాఫ్ కావడానికి ఈ 30 నిమిషాల టైమ్ పడుతుంది. ఉదయం .8.3 ఫ్లైట్ అంటే అది రన్ వే మీద ఫ్లైట్ టెకాఫ్ అయ్యే టైం అని అర్థం అంతే కాని మీరు విమానంలో కూర్చునే సమయం కాదు,విమానంలో 8.గంటలకల్లా కూర్చోవాలి..ట్రైన్ లో మాదిరిగా బయలుదేరేముందు నిమిషం వరకు కూడా వెళ్ళడం ఎట్టిపరిస్థితుల్లో కూడా సాధ్యంకాదు.టైంకు ప్లైట్ బయలు దేరకుంటే ఆ ఏయిర్ లైన్స్ మీద కూడా హెవిగా ఫెనాల్టి చార్జీలు పడుతుంటాయి కాబట్టి లేట్ గా వచ్చే ఎవరికోసం కూడా ఫ్లైట్ కొద్దిసేపు ఆపడం జరగదు.కాబట్టే అందరు ఈ జాగ్రత్తలు పాటించి టైంకు 2,3గంటల ముందే ఏయిర్ పోర్టుకు చేరుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర 30 నిమిషాలు, సెక్యూరిటి చెకింగ్ 1గంట, గేట్ దగ్గర చేరుకోవడం,ఫ్లైట్ లో కూర్చోవడం మరో గంట కామన్ గా 2,3 గంటలు గడుస్తుంది.ప్రయాణికుల రద్ది లేనప్పుడు మాత్రమే దీంట్లో కొద్ది సమయం తగ్గుతుంది.
• ఫుడ్ తినడం. పొద్దున్నే ఇంటినుండి బయలుదేరేప్పుడు ఉప్మా ,ఫులిహోరా,పూరి,చపాతి లాంటివి విడిగా మీరు తెచ్చుకుని ఫ్లైట్ ఎక్కేముందు ఏయిర్ పోర్టు లాంజిలో కూర్చుని తినవచ్చు,లేదా ఫ్లైట్ లో కూర్చున్న తరువాత కూడా రిలాక్స్ గా టిఫిన్ తినవచ్చును.ఏయిర్ పోర్టులో టిఫిన్స్ ,మీల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. (టిఫిన్ మరకలతో సీట్లను కంగాళిచేయకుండా వాటర్ బాటిల్, స్పూన్ లాంటివి తెచ్చుకోగలరు) ఫైట్ లో వాష్ రూంకూడా ఉంటుంది,కాబట్టి అక్కడే హాండ్ వాష్ కూడా చేసుకోవచ్చును. ఏయిర్ పోర్టు లాంజిలో కూడా చాలా ప్లేసుల్లో వాష్ రూంలు, డ్రింకింగ్ వాటర్ దొరకుతుంది.
• టూర్ కు వెళ్ళేవారు. లగేజి,బట్టల జాగ్రత్తలు.. విలువైన బంగారు అభరణాలు ఏవి తెచ్చుకోవద్దు,ఇంట్లో పెట్టుకుని రాగలరు, మీరెగ్యులర్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నట్లయితే మర్చిపోకుండా తెచ్చుకోవాలి.6నెలలు USA కు వెళ్ళేమాదరి పెద్ద పెద్ద బ్యాగులు, హెవి సూట్ కేసులు తెచ్చుకోకుండా లైట్ లగేజి 10 కిలోలు దాటకుండా తెచ్చుకోవాలి. ప్రయాణంలో బస్ నుండి హోటల్ రూంకువెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు , మద్యలో రైల్వే ప్రయాణంలో ఫ్లాట్ ఫాం మీదకు వెళ్ళేప్పడు వచ్చేప్పుడు, ప్రతిసారి ఎవరి లగేజి వారే ఖచ్చితంగా మోసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.బ్యాగులో ఖాళి ఉంచుకోవడం ద్వారా మద్యలో ఏదైనా షాపింగ్ చేసినకూడా సర్దుకోవచ్చు. ఏదైనా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుని విడిచిన బట్టలను ఆ కవర్ లో వేసుకుంటే సులభంగా ఉంటుంది.ఈ విషయంలో క్లారిటి లేకుండా కేవలం విడిచిన బట్టలకోసమని రెండవ బ్యాగు తెచ్చుకునేవారుంటారు,ఇది అనసవర ప్రయాస. 6 రోజుల టూర్ లో కేవలం 4 జతల బట్టలు తెచ్చుకుంటే చాలు.దాంతో టవల్,సోప్స్,బ్రష్,టూత్ పేస్టు లాంటి మినిమం లగేజి…
• ఫ్లైట్ ఎక్కేప్పుడు,ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు జాగ్రత్తలు….
• ఏయిర్ పోర్టు లాంజిలో మీరు ఎక్కే ఫ్లైట్ గేటుముందు మీ బోర్డింగ్ పాస్,ఐ.డి.కార్డు మరోసారి చెక్ చేస్తారు. అక్కడినుండి కొన్ని ఫ్లైట్ లలో బస్ లో తీసుకెళ్ళి దిగపెడుతారు.మరి కొన్నింట్లో బ్రిడ్జిమీదుగా డైరెక్టుగా ఎక్కవచ్చును. ఫ్లైట్ ఎక్కే ముందు మరోసారి మీ బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. ఫ్లైట్ లోపలికి అడుగుపెడుతుండగానే ఏయిర్ హోస్టెస్ లు మీకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. బోర్డింగ్ పాస్ మీదున్న మీ సీటునెంబర్ చూసుకుని మీసీటులోకి వెళ్ళి డైరెక్టుగా కూర్చోవచ్చును.అర్థంకాకుంటే లోపల ఉన్న ఏయిర్ హోస్టెసులు మీసీటును చూపిస్తారు.మీ హ్యండు బ్యాగును మీసీటు మీద లగేజి సెక్షన్ లో పెట్టుకొని మీ సీట్లో కూర్చోండి . మీ సీట్లో కూర్చున్నతరువాత సీటు బెల్టుపెట్టుకొండి.అందరు కూర్చుని సద్దుమణిగాక విమానం రన్ వే మీదకు వెళ్ళేలోగానే మీకు మైకులో అనన్స్ మెంట్ వినపడుతుంటుంది.విమాన ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో స్పీకర్ లో వినపడుతుంటే అక్కడున్న ఏయిర్ హోస్టెస్ లు వెనుక,మద్య,ముందు 3 ప్లేస్ లలో నిలబడి సూచనలకు అనుగుణంగా సీటు బెల్టు ఎలాపెట్టుకోవాలి తదితర వాటిని లైవ్ డెమోలో చూపిస్తుంటారు.విమానం రన్ వేమీదకు వెళ్ళేవరకు ఈ సూచనలు పూర్తవుతాయి.తరువాత వారు కూడా సీట్లో కూర్చోవాలి.రన్ వే మీద ఫ్లైట్ ఒక్కసారి బయలుదేరి టేకఫ్ అయ్యాకా ఆకాశంలోకి వెళ్ళిన 5,10 నిమిషాల తరువాత మీ సీటు బెల్టులను తీయవచ్చును,టీ,కాఫీలు,ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును అనే సూచనలు వినపడుతాయి.మీరు తెచ్చుకున్న హోంఫుడ్ ఇప్పుడైన తినవచ్చును. మీదగ్గర వాటర్ లేకుంటే అదొక్కటే దాంట్లో ఉచితంగా ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తారు.మిగితావన్ని ఫ్లైట్ లో పేమెంట్ చేసే ఫుడ్ ఐటంస్ మాత్రమే ఉంటాయి.
మీరు హోంఫుడ్ తెచ్చుకోకుంటే ఇక్కడైన ఫుడ్ అర్డర్ చేసుకుని స్పాట్ పేమెంట్ చేసి తినవచ్చును.మద్యలో మీరు టాయిలెట్ ,బాత్రుంలకు వెళ్ళాల్సి వస్తే ఫ్లైట్ కు ముందు వెనుకాల బాత్రూంస్ ఉంటాయి.వాటిల్లోకి మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చును . మీరు దిగాల్సిన సిటి వచ్చే ముందు పావుగంటే ముందే తిరిగి మీ సీట్ బెల్ట్ లు బిగించుకోమని వినపడుతుంది.ఆప్రకారంగా మీసీటు బెల్టులను తిరిగి బిగించుకోండి.ఆకాశంలో మేఘాలు ఉండి వాతావరణం బాగా లేనప్పుడు కూడా సీటు బెల్టులను బిగించుకోండనే సూచనలు వస్తుంటాయి.అప్పడు కూడా వాటిని అంతా పాటించాలి.


• ఫ్లైట్ దిగినాక లగేజి తీసుకోవడం.
• మీరు దిగాల్సిన సిటిలోని ఏయిర్ పోర్టు రన్ వే మీద ఫ్లైట్ లాండ్ అవ్వగానే ,అంతా వరసగా ఫ్లైట్ బయటకు వచ్చి బస్ లో కాని బ్రిడ్జిమీదుగా కాని ఏయిర్ పోర్టులాంజిలోకి వెళ్ళాలి.మీరు ఫ్లైట్ దిగడానికి ముందే మీలగేజి ఏ నెంబర్ బెల్ట్ మీదకు వస్తుందో విమానంలో అనౌన్స్ మెంట్ వినపడుతుంది. ఆ సూచన విని ఆ ప్రకారంగా ఆ నెంబర్ బెల్ట్ దగ్గరకు వెళ్ళి నిలబడాలి. బెల్ట్ దగ్గరకు వెళ్ళడానికి ముందే లగేజి రావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఆ మద్యలో పక్కనే ఉన్న వాష్ రూంల లోకి వెళ్ళి వస్తే రిలాక్స్ గా లగేజి తీసుకోవచ్చు.మీరు వాష్ రూంలోకి వెళ్ళి వచ్చేలోపు లగేజిని ఎవరు తీసుకుపోరు.ఇక్కడ కాస్తా టైంపడుతుంది.మీకు ఏ బెల్ట్ మీదకు లగేజి వస్తుందో అర్థంకాకుంటే మీతో పాటే ఫ్లైట్ దిగే ప్రయాణికుల వెంటే వెళ్ళండి.అందరు దాదాపుగా అదేబెల్ట్ దగ్గరకు చేరుకుంటారు . లేదంటే అక్కడ డిస్ ప్లే లో మీరు దిగిన ఫ్లైట్ నెంబర్ ఏ సిటి నుండి ఏ విమానయాన సంస్థ ఫ్లైట్ వివరాలు అక్కడ కనపడుతాయి.అప్రకారంగానైనా ఆ బెల్ట్ దగ్గరకు వెళ్ళండి.రౌండ్ గాతిరిగే బెల్ట్ లో వరుసగా ఒక్కో ట్రేలో అందరి లగేజి వస్తుంటుంది.మీ సూట్ కేస్, బ్యాగు రాలేదని టెన్షన్ పడుకుండా ఆ బెల్ట్ తిరుగుతున్నంత వరకు వేయిట్ చేయండి.అందరి లగేజి వచ్చి మీది మాత్రమేరాకుండా ఉండి ఇంతలో మరో ఫ్లైట్ లగేజి ఆ బెల్ట్ మీదకు వస్తుంటే మాత్రం అక్కడున్న పోలీస్ సెక్యూరిటికి కంప్లైంట్ ఇవ్వవచ్చును.లేదా మీ విమానయాన సంస్థ కౌంటర్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వవచ్చును.మీ బోర్డింగ్ పాస్ మీదున్న లగేజి అక్నాలెడ్జ్ ఉండడం , చూపించడం ఇక్కడ తప్పనిసరి. ఒక్కోసారి మీరు ఫ్లైట్ ఎక్కడానికి ముందే లగేజి పోరపాటున ఇంకో ఫ్లైటులోకి ఎక్కించవచ్చును. అందుకే మీరు ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళేవరకు మీ బోర్డింగ్ పాస్ ను మీతోపాటే జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేది. నూటికి 99శాతం లగేజి మిస్ కాదు.ఒకవేళ మిస్ అయితే మీ బోర్డింగ్ పాస్ వెనుక ఉన్న అక్నాలెడ్జ్ తో మీ లగేజిని ట్రేస్ చేయడం సులభం అవుతుంది.
మొదటిసారి విమానంలో ప్రయాణించేవారికి ఈ సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడుతాయిని ఆశిస్తున్నాను.మీ ప్రయాణం శుభకరంగా సాగాలని కొరుకుంటూ…రవీందర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!