సింహ రాశిలో జన్మించిన వారి జాతకం

సింహ రాశిలో జన్మించిన వారి జాతకం.

మీకు సంకల్పబలం,ఆత్మ విశ్వాసం,అభిమానం,పట్టుదల ఎక్కువ.అందరికన్న ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరిక. మీ మాట పాటిస్తే ఇతరులు పాటిస్తే వారు బాగుపడుతారనే నమ్మకం,దాంతోపాటు అధికచురుకుతనం,తొందరపాటు,కోపం,పశ్చతాపం,విశాల హృదయం,ఇవన్ని మీ స్వభావంలో ముఖ్యంగా కనపడుతాయి.ఒక్కముక్కలో అడవిలో సింహానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్ని మీకు ఉంటాయి.మీరు ఏనాడు ఎట్టి పరిస్తితిల్లోను ఓటమిని అంగీకరించరు.ఇతరులను ఏదో ఒక మంచి మార్గంలో నడపాలనే కోరిక మిమ్మల్ని వదలదు.పరిస్థితులతో ఏనాటికి నిరాశపడకపోవడం మీకు గల మంచి లక్షణాలు.ఆవేశం కొంచెం ఎక్కువ.దాని వల్లే మీరు చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది.మీరు ఇతరుల బాధ్యతలను తలపై పెట్టకుని చిరుకాలం బాధపడుతుంటారు.
మీకు మంచి మాటకారితనం ఉంటుంది.మీ ఆకర్షణకు లోనై ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు.నేనే గొప్పవాణ్ణనే అహంకారం మిమ్మల్ని వెంటాడుతుంది.ఇతరులు బాగుపడాలని మనస్పూర్థిగా సలహాలిస్తారు.కాని అదే పనిని అంటే ఇతరులు మీకు సలహాలు ఇస్తే మీకు నచ్చదు. ఇతరలు మీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన ,మిమ్మల్ని మార్చాలని చూసేవారితోని జివితాంతం దూరంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఎవరిప్రవర్తన నచ్చకపోయిన వారితో గొడవ పెట్టుకోవడం కాకుండా అసలు ఆ పరిసరాలకే పోకుండా ఆవిషయాన్ని అంతటితో వదిలిపెడుతారు.సమాజంలో వారెంత పరపతి కలవారైన కూడ వారిని పట్టించుకోకండా వదిలిపెడుతారు.కావలంటే వారి స్థాయిలో ప్రముఖులు కావడానికి ప్రయత్నిస్తారు తప్ప నచ్చని వారితో ఎలాగో సర్ధకుపోదామని ప్రయత్నించరు.ఇతరుల వస్తువు వాడడానికి కూడ ఇష్టపడరు.పట్టుదలతో స్థిర చరాస్తులు పోయినకూడ లెక్కచేయరు.ఇతరుల దగ్గర నీచత్వం ఎక్కవగా కనిపిస్తే మీ సహనం నశించిన రోజున కొట్టగలరు.కాని వారు కాళ్ళు పట్టుకుంటే వెంటనే మర్చిపోతారు.ఎవరు పరిచయంలేని కొత్త ప్రదేశంలోకి ఫోయిన కూడా అక్కడి వారిని ఆకర్షిస్తారు.మీరు స్వంత వ్యాపారం మొదలుపెడితే ధీర్ఘకాలంలో ఖచ్చితంగా వృద్దిలోకి వస్తారు.వృద్దిలోకి వచ్చేముందు మానసికంగా ఆర్థికంగా అలసట పొందిన కూడా ధీర్ఘకాలం పాటు చేసేపనినే అంటుపెట్టకుని ఉండాలి.మీరు పనిచేసే ఎక్కడైనా ఇతరులకు ఆదర్శంతంగా ఉండేలా వ్యవహరిస్తారు.మీరు చేసిన పని మీ తరువాత ఆ స్థలంలోకి వచ్చేవారికి ప్రమాణికం అవుతుంది.మీకు జీవితంలో అనకోకుండా ధనం,అవకాశాలు,పదవులు,కీర్తి అప్రయత్నంగానే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి.కాని మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు,పట్టుదల కారణంగా చాలావరకు మిమ్మల్ని వెదుక్కుంటు వచ్చినవాటిని కోల్పోతారు.అప్రయత్నంగా ఆస్తి లబించడం,విరాళములు,ధనసహాయం లభిస్తుంది.కాని ఇతరులు అవసరాలను గుర్తించి వారిని ఆదుకోవడానికి ఇలా వచ్చినదంతా అలా ఖర్చుపెడుతారు.కాబట్టి డబ్బు ఖర్చుపెట్టే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది.అప్పులు చేయడం విషయంలో మీరు భయపడక పోయిన , చేసిన అప్పలు తీర్చడంలో నిస్సహ్హాయ పరిస్థితుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తపడాలి.
మీరు ఏ స్తితిలో ఉన్న మిమ్మల్ని ఆశ్రయించేవారు ,మీపై ఆధారపడేవారు,మీకు లొంగినవారు,మీ అడగుజాడల్లో నడిచేవారు ఎప్పుడు ఉంటారు.మీకు శారీరక బలమే కాక మనోబలం,భావాల తీవ్రత కూడా కూడా చాల ఎక్కువ. మీ తెలివితేటలు చురగ్గా ఉంటాయి.ఇతరులను అతిగా మీరు విమర్షించడం మీకు పనికిరాదు.మీ వేగానికి తట్టుకోలేని వారిమీద క్షణంలో కోపించే దుర్గుణం మీకు ఉంది.దాంతో మీకు చాల నష్టం జరుగుతుంది.మీ దృష్టిలో సమాజంలో ఎక్కువ మంది ఆనరు.మీకు నచ్చని విషయాలుఎక్కవ మందిలో కనిపిస్తాయి. వారిని మీరు తప్పులు పట్టడం,న్యాయం పేరుతో తగాదాలు పెట్టుకోవడం,పోరాడి వెనక్కు మర్లడం,జీవనోపాధి మార్గాలు దెబ్బతినడం లాంటి వాడితో మీ జీవితం కష్టాలపాలు కావచ్చు.ఎవరే తప్పుచేసినా వారది ఒప్పుకుని అంగీకరిస్తే క్షమిస్తారు.మీకు సర్వ నష్టం చేసినవాడినికూడ మీ కాళ్ళుపట్టకుంటే క్షమిస్తారు.మీకు కోపం కలిగించే రెండు విషయాలు..మొదటిది మీకు తెలియకుండా చాటుమాటు తనం చేయడం.రెండు నమ్మక ద్రోహం చేయడం.
ఇతరులతో మీకు ప్రేమో ,ద్వేషమో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సాధ్యం.మాటల్లో ఇతరులను మభ్యపుచ్చి లౌక్యంతో జీవితాన్ని సాగదీయడం మీకు చేతకాదు.మానవత్త్వం,మంచితనంమీద మీకు అంతులేని అపార నమ్మకం ఉంటుంది.కొత్తవారిని నమ్మకుండా ఉండలేరు.జాలిగొలిపే దృశ్యాలు కనిపిస్తే మాత్రం మీరు కష్టాలపాలైన కూడా వారి బాధ్యత వహిస్తారు.మీ ఉదార గుణాన్ని కనిపెట్టిన కొందరు , మిమ్మల్ని కావాలని మోసం చేసి మీ సహాయ సహాకారాలను అనేక రకాలుగా పొందే అవకాశం ఉంది.
ఇతరులను మోసం చేయడం,నమ్మించి ముంచడం,కపట ప్రేమ చూపడం మీ స్వభావంలో లేవు.అందరూ మీ మాటలకు లోబడాలని ,అందరికన్నా తెలివైన వారమని మీ నమ్మకం.మీ కంఠధ్వని ఇతరులను ఆకర్షిస్తుంది.మీ మాటలు ఇతరులను ఆలోచనల్లో పడేస్తాయి.డబ్బు,ఆస్తిపాస్తులు,అధికారం మీ దృష్టిలో ఏమంత విలువైనవి కావు.కాని పేరు ప్రతిష్టలు,ప్రచార కాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు.
వైధ్య వృత్తికి సంబందించిన అన్ని శాఖలు మీకు అనుకూలం.బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో మీరు బాగా రాణిస్తారు.వ్యాపారాల్లో ప్రచారానికి సంబందించిన పబ్లిసిటి ఏజెన్సి,ఔషదాలు,రసాయయ ద్రవ్యాలు,వస్తు ప్రదర్శన శాలల నిర్హహణ,టూరింగ్ ఏజెంటు లాంటి లాంటి వృత్తులు మీకు సరిపడుతాయి.ఇంకా వాగ్ధాటితో కూడిన భోధన వృత్తుల్లో కూడా మీరు రాణిస్తారు.మొత్తం మీద మీరు ఉద్యోగాల కన్న వ్యాపారలలోనే ఎక్కువగా రాణిస్తారు.ఒకరి కింద పనిచేయు చిన్న చిన్న ఉద్యోగాలలో మీకు సహించదు.అధికారులతో మీకు పొత్తుకుదరదు.ఒకరి క్రింద పనిచేయడం మీ మనస్సుకు కష్టంగా తోస్తుంది.ఈ విషయంలో మీకు నిగ్రహం అవసరం.లేదంటే జీవితంలో సుఖపడే అవకాశాలకు దూరం అవుతారు.దేశానికి అత్యన్నత పదవిలో ఉన్నదేశాధ్యక్షుడైనా ఇంకొకరి ఆధిపత్యంలో (దేశ సార్వభౌమత్త్వం)ఉండాల్సిందేననే నిజాన్ని గ్రహిస్తే మీరు ఇంకొకరి దగ్గర పనిచేయగల్గిన పరిస్థితులు మెరుగవుతాయి.కాని వీలైనంతగా మీరు స్వతంత్ర స్వతంత్ర వృత్తి ,వ్యాపారలకు ముందు పెద్దపీట వేస్తారు.వేరే వ్యక్తి,సంస్థ ఆధిపత్యంలో పనిచేయగల్గినంతకాలం మీకు లోలోపల మీ స్వాతంత్రం కోల్పాయమన్న భావనతోనే పనిచేస్తారు.
ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటే తీర్చడం కష్టం.అలాగే మీరు ఇతరులకు అప్పు చేబదుల్లు ఇస్తే తిరిగిరావడం కష్టం.
ఆదర్శంతమైన వారిని వివాహమాడి , వారిని ఆరాధించాలనే కోరిక మీకుంటుంది.కాని ఈ విషయంలో మీకు ఆశాభంగం కలుగవచ్చును.మీరు త్వరపడి ఆవేశంలో వివాహం చేసుకొనుట,వారిలో మీరాశించిన ప్రేమతత్త్వం లబించనపుడు మీ జీవితం కూలిపోయినట్లు బాధపడే అవకాశముంది.మీకు జనాకర్షణ ఎక్కువ.మీ ఆకర్షణలో పడ్డ వారితో సులభంగా ప్రణయ సంబందాలు ఏర్పరుచునే అవకాశం ఉంది.చిన్నతనంలో జ్వరబాధలు,వడదెబ్బకొట్టుట,దెబ్బలు తగిలించుకోవడం,అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు.యవ్వన దశలో జీర్ణకోశ బాధలు,కడుపునొప్పి,తలనొప్పి,కంటిజబ్బులు కలుగవచ్చును.శరీర వ్యాయామం ,ఆరు బయట విహారం మీకు ఆరోగ్యాన్ని కలుగుచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!