అణువుల విచ్చిన్న&సంయోగ శక్తి=భౌతిక విజేతలు,యోగులు.

anuvula shakti

అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు.
అణువుల్లో ఉన్న శక్తే మానవుని జీవితాల్లో జరుగుతున్నది.s
. రేడియో యాక్టివ్ ఆణువైన యురేనియం అణు సంఖ్య 92(అణుభారం 238) , సీసం(Lead) అణుసంఖ్య 82(అణుభారం 207), హైడ్రోజన్ అణుసంఖ్య 1 (అణుభారం 1). భూమిమీద ఉన్న నిలకడ కలిగిన సహజ అణువుల్లో దాదాపు చివరిదైన యురేనియం అణువులో(యు-238) 92 ప్రొటాన్లు +146 న్యూట్రాన్స్ ఉంటాయి. (మెండలివ్ ఎలిమెంట్స్ లిస్ట్ ఇంకా పెద్దదిగా ఉన్నదనుకోండి అది వేరే విషయం)
92 ప్రొటాన్లు +146 న్యూట్రాన్స్ కలిగిన అతి భారమైన స్థితిలో యురేనియం(యురేనియం ఐసోటోప్స్ ల అణుభారం వేరేవిషయం) నిలకడగా ఉండలేక నిరంతరం విచ్చిన్నం అవుతుంటుంది. ఆ విచ్చిన్నం వలన ఏర్పడిన ద్రవ్య నష్టం అపారమైన శక్తిగా ( ఖచ్చితంగా చెప్పాలంటే E=mc2 ప్రకారం ద్రవ్యనష్టం ఏమేరకు జరుగుతుందో అంతే స్థాయి ప్రపోర్షనేట్ శక్తిగా మారుతుంటుంది.) మారుతుంది.చివరకు యురోనియం అణువు తన అణుభారం తగ్గించుకుంటూ వచ్చి వచ్చి నిలకడైనా సీసంగా మారుతుంది.
యురేనియం లోని సగం అణువులు ఇలా సహజంగా తన అణుభారం తగ్గించుకుని నిలకడైన సీసంగా పట్టేకాలం 450 కోట్ల సంవత్సరాలు.ఇది యురేనియం అణువు హఫ్ లైఫ్. దాదాపుగా ఇప్పుడున్న సూర్యుడు వెలుగుతున్న జీవిత కాలానికి సమానం. అలాగే మిగితా రేడియో ఆక్టీవ్ అణువులకు కూడా ఒక్కో అణువుకు దానిదైన సహజ హఫ్ లైఫ్ జీవన కాలం ఉంటుందని తెలిసిందే.
ఇక అన్నింటికంటే తేలికైన మరియు విశ్వంలో అత్యధికంగా ఉన్న హైడ్రోజన్ అణువులో మాత్రం యురేనియానికి రివర్స్ గేర్ లో శక్తి విడుదల అవుతుంది.యురేనియంలో జరిగేది కేంద్రక విచ్చిత్తి.. అదే హైడ్రోజన్ అణువులో జరిగేది కేంద్రక సంయోగం.సూర్యుడిలో 90శాతం ఉన్నది హైడ్రోజనే. సూర్యుడిలోని హైడ్రోజన్ నిరంతర కేంద్రక సంయోగం ద్వారానే సూర్యుడిలో అంత శక్తి పుడుతుంది. ద్రవ్యనష్టం శక్తిగా మారగ మిగిలింది ప్రతిక్షణం హీలియంగా మారుతుంది. సూర్యుడి మీద ప్రతి గజం స్థలంలో ప్రతి సెకనుకు 70 వేల హర్స్ పవర్ శక్తి వెలువడుతుంది. ఇంతటితో అణువులు , శక్తి, కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంయోగం టాపిక్ ఆపి అసలు విషయానికి వస్తాను.
అణువులకు ఆథ్యాత్మికానికి ఉన్న సంభందం మీకు గతంలోనే కొన్ని సార్లు తెలియపరిచాను.ఈ రోజు టాపిక్ వచ్చింది కాబట్టి అదే విషయం మరింత లోతుగా మరోసారి…
అచ్చ తెలుగులో చెప్పాలంటే యురేనియం అణువు అచ్చోసిన అంబోతులాంటిది. ఊళ్ళో ఇతర పశు సంతతికే కాదు మనుషులకు కూడా ఒక టైంలో అంబోతు ప్రమాదకరంగా మారుతుంది. దాన్ని చివరకు పశువైద్యశాలకు తీసుకెళ్ళి దాని వ్రుషణాలకు వట్టె కొడుతారు. అప్పటినుండి దాని పొగరు,వగరు క్రమంగా తగ్గిపోతుంటుంది.
అలాగే ఫార్చున్ 500 లో ఉన్న కంపెనీలు,దాని ఫౌండర్స్,యజమానులు,టాప్ లెవల్ క్యాడర్ టీం అంతా అచ్చోసిన అంబోతులాంటి వారు లేదా సైన్స్ భాషలో యురేనియం లాంటి వారు.నైతికం, అనైతికం, ధర్మం ,అధర్మం లాంటివి తుంగలొకి తొక్కి వారి వ్యాపార ప్రయోజనాల కోసం, వ్యాపార లాభం కోసం మాత్రమే నిరంతరం పాటు పడుతుంటారు. ఒకప్పుడు మనుషులు ప్రశాంతంగా ఉన్న వస్తుమార్పిడి వ్యవస్థ నుండి ప్రపంచం గ్లోబల్ విలేజిగా మారుతుండడంతో రోజు రోజుకు వ్యక్తి గత వ్యాపారాలు లాభాల నిష్పత్తి తగ్గుతు భారిస్థాయి పెట్టుబడులున్న మల్టినేషనల్ కంపెనీలు మాత్రమే నిలదొక్కుకుంటున్నాయి. ఆ భారిలో కూడా అతి భారి మాత్రమే మార్కెట్ లో నిలబడుగలుగుతున్నాయి.తీవ్రమైన పోటికి,నష్టాలకు తట్టకోలేక అనేక కంపెనీలు (కొన్ని భారి కంపెనీలు సైతం) నిరంతరం క్లోజ్ అవుతూనే ఉంటాయి. సెల్ ఫోన్ కాంపిటీషన్ లో తమ్ముడి(అనిల్ అంబాని) రిలయన్స్ కమ్యూనికేషన్ చతికిల పడింది.అన్న ముఖేష్ అంబాని జియో దూకుడుగా ముందుకు వచ్చి మార్కెట్ లో టాప్ కు ఎదగింది. పోటీ తట్టుకోలేక వోడఫోన్ – ఐడియా కంబైన్డ్ గా VI గా మారి కూడా ఏటా నష్టాలనే మూటకట్టుకుంటుంది.ఇక ప్రభుత్వ రంగ సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ . ఎన్ని నష్టాలు వచ్చిన కూడా కేవలం ప్రభుత్వ (ప్రజల) డబ్బు మేస్తూ ఈసోరోమంటూ ఏదో నడుస్తుంది.ఇక రంగంలో మిగిలిన ఏకైక గట్టి పోటిదారు ఏయిర్ టెల్ మాత్రమే..ఆ ఏయిర్ టెల్ అధిపతి సునిల్ భారతి మిట్టల్ లాంటిది ఈ పోటీని చూసి 140 కోట్లున్న ఈ దేశంలో కేవలం 2,3 సెల్యూలర్ కంపెనీలు మాత్రమే కొనసాగడం దేశానికి మంచిది కాదని అవేదన చెందాడు.
ఇది ఒక్క సెల్యూలర్ రంగానికి సంబందించినంతవరకే…ఇక విమానయానం చూస్తే టాప్ ఏయిర్ లైన్స్ , ఎంతో వ్యాపార దక్షత కలిగిన ఇండిగో ఏయిర్ లైన్స్ గడిచిన 5 త్రైమాసిక పలితాల్లో ప్రతి 3నెలలకు కనీసం 3000 కోట్లు నష్టం నమోదు చేస్తు ఉంది.సరే ఇది కరోనా ఎఫెక్ట్ అనుకుందాం.కాని మొన్ననే 4-5ఏళ్ళ క్రితం మూల పడ్డ జెట్ ఏయిర్ వేస్ విషయం అంతకు ముందు మూలన పడ్డ విజయమాల్య కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ సంగతేంటి? ఇక ఇప్పడున్న కేంద్ర ప్రభుత్వ విమాన రంగ సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సంగతి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏటా 60వేల కోట్ల నష్టానికి నడుస్తుంది. దాన్ని అమ్మాలని కేంద్రం శత విధాల ప్రయత్నిస్తున్న గత కొన్ని సంవత్సరాల బట్టి దాన్ని కోనే నాధుడే లేడు.కొన్ని ఏండ్ల క్రితం దాన్ని పునరుద్దరించడానికి దాని మీద 25వేల కోట్ల ప్రభుత్వ(ప్రజల) సొమ్ము కుమ్మరించిన కూడా గోడకు కొట్టిన సున్నం లాగానే వ్యర్ధం అయిపోయింది తప్ప ఇప్పటికి కూడా దాంట్లో ఏ డెవలప్ మెంట్ లేదు.
ప్రపంచం మొత్తం మీద వ్యక్తుల దగ్గర , సంస్థలు,ప్రభుత్వాల దగ్గర జరిగే నష్టాలు అనేవి ఖగోళంలోని బ్లాక్ హోల్స్ లాంటివని గతంలోనే తెలియపరిచాను. ఈ నష్టాలు అనేవి గతంలోను, ఇప్పడు, భవిష్యత్తులోనూ ఉంటాయి. ఇది ఆవాంచనీయ సహజ పరిణామం.వీటితో ఎళ్ళ వేళల వ్యాపారం-పోటి-లాభం సిస్టం ఉన్నంత వరకు వీటితో వేగక తప్పదు. పోనీ పోటి , వ్యాపారం లాంటివి తీసేసి సమసమాజం-కమ్యూనిజం టైపు వ్యవస్థకు మారుదామా అంటే అది అంతకు మించి హనికరమైనటువంటిది.పనిచేసే వ్యక్తుల పోరాట పటిమ లోపించి, ఎంత క్రుషి చేస్తే ఏం లాభం, ఎలా చేసిన నాకు రావల్సింది వస్తుందిలే అనే భావన ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో మనం క్లియర్ గా గమనించవచ్చును.
****వ్యాపార సంస్థల నష్టాలు పక్కకు పెడితే ..అసలు టాపిక్ కు వస్తాను…****
ఫార్చున్ 500 కంపెనీలు (ఉదా గూగుల్, అమెజాన్, ఆపిల్..వాల్ మార్ట్, వోక్స్ వాగన్, సామ్ సంగ్,మైక్రోసాఫ్ట్, ఫోర్డ్ మోటర్..సోని , నెస్లే.. తదితర)వాటి అధిపతులు,కీలక స్థానాల్లోని హెడ్స్ అంతా అంబోతులాంటి వారే.(ఇక్కడ అంబోతు లోని మొరటుదనం గురించి కాదు చెప్పేది వారి తిరుగులేని పోరాట పటిమ,స్రుజనాత్మక నైపుణ్యం,కార్య చరణ గురించి మాత్రమే రిలేటెడ్)లేదా సైన్స్ భాషలో చెప్పాలంటే వీరంతా యురేనియం అణువు లాంటి వారు. ..యురేనియంలో కేంద్రక విచ్చిన్నం జరుగుతుందని ఇంతకు ముందే చూసాం…కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంయోగం అంటే?????
కేంద్రక విచ్చిన్నం అంటే ఆథ్యాత్మిక భాషలో ఎక్కడ ఏ మాస్టర్ దగ్గర నేర్చుకోకుండా నేను ధ్యానంలో ద్రష్టగా దర్శించిన విషయం..
***కేంద్రక విచ్చిత్తి అంటే ..యురేనియం తన అణుభారం తగ్గించుకోవడానికి సహజంగా విచ్చిన్నం జరిగినట్టు..ఆలోచించడం, ఆలోచనలు చేయడమే కేంద్రక విచ్చిత్తి..***
(ప్రతిరోజు ఆయా కంపెనీల అధిపతుల నుండి కనీసం మధ్య స్థాయి డెసిషన్ మేకర్స్ వరకు అంతా ఆ కంపెని నిరంతరం లాభాల్లో నడువాలంటే ,పోటిదార్ల పోటిని తట్టుకోవాలంటే ఏంచేయాలి, మారుతూ ఉండే ప్రజల మెంటాలిటి+ ట్రెండ్ కు తగ్గట్లు నిరంతరం కొత్త ఉత్పత్తులు ఎలా తీసుకురావాలి, వాటిని ధర అనే అతి పెద్ద భూతం మింగేయకుండా సరసమైన రేట్లకు ఎలా అందించాలి,క్వాలిటి కంట్రోల్ ఎలా చేయాలి, కొత్తగా ఎంటర్ అయ్యే ఇతర కంపెనీల పోటి ఉత్పత్తుల నుండి తమ సేల్స్ పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో నిరంతరం ఇవే నాన్ స్టాప్ ఆలోచనలతో వారి కార్యక్రమాలు కొనసాగుతుంటాయి….యురేనియంలో ఎమి జరగుతుందో సమస్త మానవాళిలో జరిగేది కేంద్రక విచ్చిత్తే…వ్యాపారంలో కేంద్రక విచ్చిత్తి సరైన టాలెంటెడ్ మేనేజ్ మెంట్ ఉన్నప్పుడు కంపెని అయిన , విడిగా వ్యక్తి అయిన సజావుగా లాబసాటిగా కొనసాగుతారు. కేంద్రక విచ్చిన్నంలో అపశ్రుతులు చోటు చేసుకుంటే నష్టాల పాలవుతారు.
-సారాంశం—-మనుషులు బయటికి నిరంతరం ఆలోచనలు చేయడం ద్వారా శక్తి వంతులు కావడం కేంద్రక విచ్చిత్తి పద్దతి…
***** హైడ్రోజన్ అణువులోని కేంద్రక సంయోగం…*****
కేంద్రక సంయోగం.. హైడ్రోజన్ అణువు కేంద్రక సంయోగం పొందడం ద్వారా శక్తి వెలుబుచ్చినట్లు ఇదే మనుష్యుల్లో కూడా కొద్ది శాతం మందిలో జరుగుతుంది . అదే ధ్యానం,యోగం. ఆలోచనల ద్వారా బయటికి ప్రయాణించకుండా ఆలోచనలు ఆపి లోపలికి ప్రయాణించడం ద్వారా కూడా ధ్యానం ,యోగం ద్వారా మనుష్యులు అంతే శక్తి వంతులవుతున్నారు.
—-సారంశం 1).. యురేనియం కేంద్రక విచ్చిన్నం పద్దతిలో మనుష్యుల్లో బహిర్ ఆలోచనల కారణంగా డబ్బు, భౌతిక సంపదలు ఏర్పడుతుంటాయి. హైడ్రోజన్ కేంద్రక సంయోగ పద్దతిలో మనుష్యుల్లో అంతర్ముఖ ప్రయాణం ద్వారా ఆత్మకు,దైవంకు దగ్గరకు జరిగి తామే దైవంగా తెలుసుకుంటారు. ఆలా ఏర్పడిన శక్తితో కూడా డబ్బు , భౌతిక సంపదలు ఏర్పడుతాయి కాని పరోక్ష పద్దతిలో మాత్రమే(తమ దైవ స్థితితో ఇతరులు ఇతర విదాలుగా సంపాదించిన సంపదను పరోక్షంగా పొందుతారు) ..సింపుల్ గా చెప్పాలంటే పైన యురోనియం కేంద్రక విచ్చిన్న పద్దతిలో శక్తి సూటిగా ప్రొటాన్- ప్రోటాన్ పద్దతి అంటారు. సూర్యున్ని మించి అతి భారి సైజు , కోట్ల కొద్ది సెల్సియస్ డిగ్రీల అతి ఉష్ణం ఉన్న నక్షత్రాల విషయంలో ప్రొటాన్- ప్రోటాన్ పద్దతిలో కాకుండా కార్బన్ సైకిల్ లేదా కార్బన్ – నైట్రోజన్ సైకిల్ అనే మరో పద్దతిలో శక్తి రీలీజ్ అవుతుంది. ధ్యానం,యోగం పద్దతిలో శక్తిని పొందడం అంటే కార్బన్ సైకిల్ లాంటి పద్దతి(పరోక్ష పద్దతి…)
—-సారంశం 2)..ఈ టాపిక్ అంతా ఈ రోజు ఫోర్డు కార్ల మానుఫాక్చిరింగ్ ఇండియాలో మూసివేస్తున్నారనే అనే వార్తతో మొదలైంది .ఇదే ఫోర్డ్ కార్ల కంపెని ఫౌండర్ 100 ఏళ్ళ క్రితం నాటి అమెరికన్ దేశస్తుడైన హెన్రిఫోర్డ్ తన ఆత్మకథలో రాసుకున్న దాని ప్రకారం…‘‘హిందువులు నమ్మే పునర్జన్మ వాస్తవమో కాదో నాకు తెలియదు కాని అలాంటి పునర్జన్మే కనుక ఉంటే గింటే బాగుండును.వచ్చే జన్మలో నేను నా ఫోర్డ్ కార్ల ఫ్యాక్టరిలోనే కార్మికుడ్నై పుట్టాలని కొరుకుంటాను.ఎందు కంటే కంపెని అధిపతిగా నాకు జీవితాంతం పోటీదార్ల నుండి ఎలా నా కంపెనిని కాపాడుకోవాలి,నా కార్ల సేల్స్ పడిపోకుండా ఏంచేయాలి, నా ఇన్వెస్టర్స్ నమ్మకం కోల్పోకుండా ఏంచేయాలి ప్లాన్లు టెన్షన్ తోనే నా జీవితం అంతా గడిచిపోయింది.పౌండర్ గా నాకు డబ్బు వచ్చిందేమో కాని మనశ్శాంతి మాత్రం దొరకలేదు..నా ఫ్యాక్టరిలోని కార్మికుడు నెలవారి జీతం పొందుతూ తన భార్య పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నాడో దాంట్లో సగం ఆనందంలో కూడా నేను నాజీవితం గడపలేదు కాబట్టి వచ్చే జన్మలో నా ఫ్యాక్టరిలోనే నేను కార్మికుణ్ణై పుట్టాలని కొరుకుంటున్నాను ’’…..ఇది హెన్రిఫోర్డ్ అవేదన…ఫోర్డులాంటి కంపెనీలు స్థాపించి ఫార్చున్ 500 నా కంపెనీ ఉండాలని నాకు కొన్ని ఏండ్ల క్రితంవరకు కూడా ఉండేది, అందుకు అనేక ప్రయత్నాలు చేసాను. కొన్నింట్లో అపజయం మరికొన్నింట్లో విజయం, నాకిప్పడు 50. నా గోల్స్ మారి పోయాయి.. ఇప్పుడు నాకు అలాంటి వాటి మీద ఆశ లేదు..మనశ్శాంతిగా , ప్రెషర్ , టెన్షన్ లేకుండా నేను చేసుకునేదో ప్రశాంతంగా చేసుకుంటున్నాను……
—-సారంశం 3 అండ్ ఫైనల్ కంక్లూషన్.).****
రామ్తా,సేత్ తదితర …టీచింగ్స్ విన్నవాడు, చదివిన వాడు ఏనాటికి ఫార్చున్ 500 లోకి ఏదుగలేడు..ఈ మార్గాలను స్టడిచేయడమే అంబోతుకు గిట్ట కొట్టడం లాంటిది.ఈ మార్గాలను స్టడిచేసిన వారు కేంద్రక సంయోగం పద్దతిలో ధ్యానులుగా, యోగులుగా ఎదుగుతారే తప్ప యురేనియం కేంద్రక విచ్చిన్నం పద్దతిలో ఫార్చున్ 500 లోకి ఏదుగలేడు. .ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే రామోజి రావు లాంటి పరిస్థితి. ఏమి లేని ఒక వ్యక్తి సినిమా తీయడానికి ఉర్రూత లూగుతాడు.తనకు పేరు,ప్రతిష్ట,డబ్బు రావాలాని ఆ సినిమా మీద తన సర్వస్వం ఆరబోసి ఆ సినిమా విజయం కోసం ఆరాట పడుతాడు.అదే రామోజిరావు గారు 2000 ఎకరాల్లో సినిమా స్డుడియో ,డబ్బింగ్,మ్యూజిక్ థియేటర్లు,షూటింగ్ లోకషన్స్, కెమెరా,హోటల్స్,గార్డెన్స్ అన్ని ఉండి కూడా ఏటా ఒక్క సినిమా కూడా తీయకపోవడం లాగా ఉంటుంది. రామ్తా,సేత్ ల స్టడితో తాను కాదులుచుకుంటే ****ఏది తలచుకుంటే అది అవుతాడని అతనికి తెలుసు.కాని పొరపాటున కాడు..కారణం వాటిలోకి అడుగుపెట్టడంతోనే వారిలో గిట్ట కొట్టడం కార్యక్రమం జరిగిపోయింది కనుక..ఫైనల్ గా రామ్తా,సేత్ ల సిస్టం కేంద్రక సంయోగం…
ఆత్మ,దైవం లాంటి ఏ జ్నానం లేని వారిలో కేంద్రక విచ్చన్న పద్దతిలో మాత్రమే డబ్బు,భౌతిక సంపదల స్రుష్టి జరుగుతుంది.
ఇది తప్పని మీరు నిరూపించాలంటే మీరు గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వారిలో కాని, ఇప్పుడు ట్రైనింగ్ పొందుతున్న వారిలో కాని ఏ ఒక్కరు ఫార్చున్ 500 కంపెనీ అధిపతిగా ఎదిగిన రోజున అతడి , అతడి కంపెని రిఫరెన్స్ నాకు ఇవ్వండి, నేను రాసింది, నా సహజ ఉద్బోద అంతా శుద్ద వేస్ట్ అని మీ ముందు మొకరిల్లుతా..
…ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల స్వంత సత్యాలు ఉన్నాయి ..వాటిని కాదనడానికి నువ్వెవరు అనే నా ద్వితీయ గురువు రామ్తా చెప్పిన దానికి విలువీస్తూనే మీరు నమ్మిన సత్యాన్ని కూడా గౌరవీస్తూ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *