మహారాష్ట్ర యాత్ర పూణే అష్టగణపతులు,భీమశంకర్ జ్యోతిర్లింగం, కొల్హాపూర్ మహలక్ష్మీ శక్తిపీఠం, పండరిపూర్, మహబలేశ్వర్ యాత్ర 4 డేస్ ఒక్కరికి రూ.12,000 తేధి 13-10-2026

మహారాష్ట్ర యాత్ర పూణే అష్టగణపతులు,భీమశంకర్ జ్యోతిర్లింగం, కొల్హాపూర్ మహలక్ష్మీ శక్తిపీఠం, పండరిపూర్, మహబలేశ్వర్ యాత్ర సంప్ర 8985246542

మహారాష్ట్ర యాత్ర 13-10-26 ఉదయం @ 6.30 A.M. హైదరాబాద్ KPHB నుండి ప్రారంభం (Return to KPHB on 16-10-26 @ 10 P.M). ఈ యాత్రలో 7 గురు వరకు  బుక్ అయితే ఎ.సి.డీలక్స్ కారు, 8-20 మంది బుక్ అయితే నాన్-ఎ.సి. టెంపో ట్రావెలర్ ఉంటుంది. Booking last date 11-10-26. Call – Shree Tours-8985246542. నాన్ ఎ.సి.రూంలతో నైట్ స్టే, విత్ భోజనంతో (ఉదయం టీ, టిఫిన్ + మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ. రాత్రి భోజనం యాత్రికులదే) ఒక్కరికి రూ.12,000 కు విత్ 3 నాన్ ఎసి హోటల్ రూం నైట్ స్టేలు (మహారాష్ట్రాలో- కొల్హాపూర్, మంచార్, థేర్). నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా ఒక్కరు రూ.8000 పేచేయవలెను, Phonepay/GPay to 8985246542, A.Ravinder. బ్యాలెన్స్ యాత్ర మొదలైనప్పుడు పేచేయవలెను.
మహారాష్ట్ర యాత్రలో దర్శించే యాత్రా క్షేత్రాలు:
1. భీమశంకర్ – జ్యోతిర్లింగం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం పచ్చని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉద్భవించింది. భీమా నదికి జన్మస్థానమైన ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన భీమశంకరుడిని దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని శాస్త్ర వచనం
2. కొల్హాపూర్ – శ్రీ మహాలక్ష్మి (అంబాబాయి) ఆలయం: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కరవీర క్షేత్రం ఇది. సాక్షాత్తు సిరిసంపదలకు నిలయమైన అంబాబాయి మాతను దర్శించుకోవడం ద్వారా సర్వ శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
3. తుల్జాపూర్ – శ్రీ భవానీ మాత: ఛత్రపతి శివాజీ మహారాజుకు ఖడ్గాన్ని ప్రసాదించిన శక్తిమయ దైవం శ్రీ భవానీ మాత. ఈ శక్తిపీఠంలో అడుగుపెట్టగానే అమ్మవారి తేజస్సు, చైతన్యం భక్తుల రోమాలను నిక్కబొడుచుకునేలా చేస్తాయి.
4.పండరీపూర్ – శ్రీ విఠోబా రుక్మిణి:(ముఖ దర్శనం) పవిత్ర చంద్రభాగా నదీ తీరంలో వెలసిన పాండురంగని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. ఇక్కడ అడుగడుగునా వినిపించే "విఠల విఠల, జై హరి విఠల" నామస్మరణ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.
5. మహాబలేశ్వర్ – మహాబలేశ్వర ఆలయం: దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన కొండల నడుమ పవిత్ర కృష్ణా నది జన్మస్థాన సమీపంలో వెలసిన మహాబలేశ్వరుని దివ్య క్షేత్రం. ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మికత ఇక్కడ మమేకమై మనసుకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తాయి.
పూణే చుట్టుపక్కల అష్ణ గణ పతులు-
6. పాలి – శ్రీ బల్లాలేశ్వర్ గణపతి: అష్టవినాయక యాత్రలో భక్తుని (బల్లాలుడు) పేరు మీద వెలసిన ఏకైక గణపతి ఈ బల్లాలేశ్వరుడు. భక్తికి బానిసనని నిరూపించిన వినాయకుని మహిమాన్విత రూపం ఇక్కడ దర్శనమిస్తుంది.
7. మహద్ – శ్రీ వరద వినాయక: భక్తులు కోరిన వరాలను తక్షణమే ప్రసాదించే కరుణామయుడు ఈ వరద వినాయకుడు. ఈ గుడిలో వెలుగుతున్న నందాదీపం 1892 సంవత్సరం నుండి నిరంతరంగా వెలుగుతూనే ఉండటం ఇక్కడి విశేషం.
8. లెన్యాద్రి – శ్రీ గిరిజాత్మజ్ గణపతి: సుమారు 300 మెట్లు ఎక్కి కొండ గుహలలో కొలువైన ఈ వినాయకుడిని దర్శించుకోవడం ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం. పార్వతీ దేవి తపస్సుకు మెచ్చి పుత్రుడిగా అవతరించిన పవిత్రమైన ఏకదంత రూపం ఇది.
9. ఓజర్ – శ్రీ విఘ్నహర్ గణపతి: విఘ్నాసురుడిని వధించి లోకాలను కాపాడిన విఘ్నహరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ స్వామిని దర్శిస్తే మన జీవితంలోని, పనుల్లోని ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం సిద్ధిస్తుందని ప్రతీతి.
10. రంజన్‌గావ్ – శ్రీ మహాగణపతి: శివుడికి త్రిపురాసుర సంహారంలో విజయం చేకూర్చిన మహా శక్తిమంతమైన గణపతి ఈ మహాగణపతి. సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ గణేశుడిని ప్రతిష్టించాడని, పూజించాడని పురాణాలు చెబుతున్నాయి.
11. థేర్ – శ్రీ చింతామణి వినాయక: భక్తుల మనసులోని చింతలను (బాధలను) హరించే దయామయుడు ఈ చింతామణి వినాయకుడు. ప్రశాంతమైన ముళా-ముఠా నదుల సంగమ సమీపంలో ఉన్న ఈ క్షేత్రం అంతులేని శాంతిని ప్రసాదిస్తుంది.
12. మోర్గావ్ – శ్రీ మయూరేశ్వర్ గణపతి: అష్టవినాయక యాత్ర ఇక్కడి నుండే మొదలై ఇక్కడే ముగియాలన్నది సంప్రదాయం. నెమలి (మయూరం) వాహనంపై కూర్చున్న వినాయకుని రూపం ఇక్కడ పూజలందుకుంటుంది. అష్టవినాయకులలో ఇది అత్యంత ప్రధానమైనది.
13. సిద్దటెక్ – శ్రీ సిద్ధివినాయక: విష్ణువు మధుకైటభులను వధించే శక్తిని ఈ సిద్ధివినాయకుడి ఆశీస్సులతోనే పొందాడు. కుడివైపుకు వంగిన తొండంతో ఉండే ఈ స్వామి చాలా శక్తివంతమైనవాడు. ఈ స్వామి దర్శనంతో మన అష్టవినాయక యాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది.
మహారాష్ట్ర యాత్ర నియమాలు మహారాష్ట్ర యాత్ర నియమ నిబంధనలు యాత్రలో స్పెషల్ దర్శనాలు, ఎంట్రెన్స్ టికెట్స్ అదనపు చార్జీలు వర్తిస్తాయి. వెహికిల్ పార్కింగ్ స్థలం వరకు మాత్రమే వస్తుంది. వర్తించే దగ్గర పార్కింగ్ స్థలం నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు అదనం. యాత్రలో-భోజనం-ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ ఉంటుంది (రాత్రి భోజనం ఉండదు, యాత్రికులే సమకూర్చుకోవాలి). డ్రైవర్ టిప్ రూ.100 అదనం. యాత్రలో ఉదయం బస చేసిన చోట కాసేపు విశ్రాంతి తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది. డేవైస్ ప్రొగ్రాం యాత్రలో చెప్పబడుతుంది. టూర్ ఆపరేటర్ చెప్పిన టైం ఖచ్చితంగా టైం డిసిప్లిన్ తో ఫాలో కావాలి, లేదంటే యాత్రలో చూడాల్సిన క్షేత్రాల్లో ఏదో ఒకటి మిస్ అయితే టూర్ ఆపరేటర్ బాధ్యులు కారు. యాత్రలో ప్రకృతి ఇబ్బందులు, ట్రాఫిక్ జాంలు, ఇతర టెంపుల్స్ లలో లేట్ కారణంగా చూడాల్సిన టెంపుల్స్ లలో ఏదేని మిస్ కావచ్చును, అంతిమ నిర్ణయం టూర్ ఆపరేటర్ దే. పై నియమ నిబంధనలకు సిద్ధపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరు. శ్రీటూర్స్ మహారాష్ట్ర యాత్ర ప్యాకేజిలో తక్కువ ఖర్చుతో, తక్కువ రోజుల్లో ఎక్కువ క్షేత్రాలు దర్శించుకునేలా టూర్ ప్రొగ్రాం చేయబడ్డవి.
మహారాష్ట్ర యాత్రలో టెంపో ట్రావెలర్ (ఉంటే) ముందు 2 వరుసల ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ కు ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలీ 1 వరుస వెనక్కి జరగాలి. యాత్ర బుకింగ్ కు చివరి తేధి 30-9-2026. యాత్రలో వెహికిల్ పార్కింగ్ వరకే వస్తుంది. వెహికిల్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు యాత్రికులే భరించవలెను.
ప్రతి యాత్రలో ఉండే నియమ నిబంధనలు వివరంగా ఇక్కడ చదవండి. https://ramthamedia.in/shree-tours-yatra-packages-terms-and-conditions/
A. Ravinder — దశాబ్దాల గ్రంథ అధ్యయనం, ప్రచురిత తెలుగు రచయిత, దశాబ్ద పుణ్యక్షేత్ర యాత్రానుభవం, ధ్యాని, ఆధ్యాత్మిక సాధకుడు, సైంటిఫిక్ గా ఆధ్యాత్మికతను తన రచనల ద్వారా వివరించే రచయిత.

Share your love
A. Ravinder, RamthaMedia
A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

Articles: 459