కామఖ్య యాత్ర 6 రోజులు తేధి 27-11-26 విత్ 4 రాష్ట్రాలు, ఒరిస్సా,వెస్ట్ బెంగాళ్,జార్కండ్-భైధ్యానాధ్ జ్యోతిర్లింగం, అస్సాం-కామాఖ్య శక్తిపీఠం.(రిటర్న్ 1-12-26)

అస్సాం కామఖ్య యాత్ర 6రోజులు-ఒరిస్సా , కలకత్తా, జార్ఖండ్ క్షేత్రాలు+ఎ.సి.ట్రైన్స్,రిటర్న్ ఫ్లైట్ తో ₹30,000 సంప్ర:శ్రీటూర్స్-8985246542.

అస్సాం కామఖ్య6 రోజుల యాత్ర తేధి 27-11-2026 సోమవారం సికింద్రాబాదు నుండి బై 3ఎ.సి. ట్రైన్ రిటర్న్ అస్సాం గౌహతి నుండి హైదరబాదుకు ఫ్లైట్ +విత్ 4 తూర్పురాష్ట్రాలు +ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా, జార్కండ్-భైధ్యనాధ్, అస్సాం-గౌహతి విత్ రిటర్న్ ఫ్లైట్ తో .Rs.30,000. రిటర్న్ డేట్ 1-12-2026 రాత్రికి బై ప్లైట్ (అప్ డౌన్ అల్ స్లీపర్ క్లాస్ ట్రైన్స్,నాన్ ఎ.సి.రూంస్,నాన్ ఎ.సి.వెహికిల్స్ తో రూ.20,000కే. ) . యాత్ర మద్యలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మద్యలో4 ట్రైన్స్ లలో ఎ.సి.ట్రైన్ ప్రయాణాలు ఉంటాయి..3 రాత్రులు హోటల్ రూం లో నైట్ స్టే స్ @1 నైట్ భువనేశ్వర్(నాన్ ఎ.సిరూంస్) ,1 నైట్ @కలకత్తా(నాన్ ఎ.సి.రూం) @1నైట్ కామాఖ్య(ఎ .సి.రూం) , ఫ్యామిలికి 1 రూం.(2-3) సింగిల్స్ గా వచ్చేవారికి సింగిల్ హోటల్ రూం అలాట్ కు రూ.4000 అదనం ) యాత్ర ప్యాకేజి ఒక్కరికి రూ.30,000., రిటర్న్ ఫ్లైట్ గౌహతి టూ హైదరాబాదు రూ.8000 దాటితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి) నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా రూ.20,000 పేచేయాలి( Gpay/Phonepay number 8985246542 , A. Ravinder, Shree Tours., బ్యాలెన్స్ రూ.10,000 మొదటిరోజు యాత్రలో క్యాష్ గా పేచేయాలి.

1) ఒరిస్సాలో : పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం),లింగరాజ టెంపుల్-భువనేశ్వర్.

2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం(దక్షిణేశ్వర్-రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత) హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే).కాళీఘాట్ టెంపుల్

3) జార్కండ్ : భైద్యనాధ్ జ్యోతిర్లింగం.

4) అస్సాంలో : గౌహతి – కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం(+తారాదేవి,చిన్నమస్తదేవి,కాళిమాత, బ్రహ్మపుత్ర నధి.)

*యాత్రలో దర్శించే క్షేత్రాల విశేషాలు..
1) ఒరిస్సా (Orisha)

A) పూరీ జగన్నాథ మందిరం (Puri Jagannath Temple)

స్థల పురాణం: ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీమహావిష్ణువు కలలో కనిపించి, సముద్రంలో కొట్టుకువచ్చిన దారువు (చెక్క)తో విగ్రహాలు చేయించమని ఆదేశించాడని పురాణం. విశ్వకర్మ విగ్రహాలు చెక్కుతుండగా, గడువు తీరకముందే తలుపులు తెరవడంతో విగ్రహాలు అసంపూర్తిగా (చేతులు, కాళ్లు లేకుండా) మిగిలిపోయాయని, అవే నేడు పూజలందుకుంటున్నాయని ప్రతీతి.
విశేషాలు: ఇది చార్‌ధామ్ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి ఆలయ గోపురంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గోపుర నీడ పగటిపూట ఎప్పుడూ భూమిపై పడదు.
మహిమ: ఇక్కడ స్వామివారిని ‘జీవం ఉన్న దేవుడి’గా కొలుస్తారు. ఇక్కడి ప్రసాదం (మహాప్రాసాదం) ఎంత మంది వచ్చినా సరిపోతుంది, ఒక్క మెతుకు కూడా వృధా కాదు.
B) కోణార్క్ సూర్య దేవాలయం (Konark Sun Temple)
స్థల పురాణం: శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు సోకిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఇక్కడ సూర్యభగవానుని ఆరాధించాడని, అందుకే ఈ క్షేత్రానికి అంతటి శక్తి ఉందని నమ్ముతారు.
విశేషాలు: ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. దీనికి ఉన్న 24 చక్రాలు రోజులోని 24 గంటలను, 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ఇది అద్భుతమైన శిల్పకళా సంపద.
మహిమ: ఒకప్పుడు ఆలయ శిఖరంపై ఉన్న అయస్కాంతం సముద్రంలో వెళ్లే నౌకలను ఆకర్షించేదని, సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహంపై పడేలా దీనిని నిర్మించారని చెబుతారు.
C) గిరిజా దేవి శక్తి పీఠం – జాజ్‌పూర్ (Girija Devi – Ashtadasa Shakti Peetham)
స్థల పురాణం: దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మత్యాగం చేసినప్పుడు, ఆమె నాభీ భాగం (బొడ్డు) ఇక్కడ పడిందని పురాణం. అందుకే ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
విశేషాలు: ఇక్కడ అమ్మవారిని ‘విరజా దేవి’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వైతరణి నది ఒడ్డున ఉంది.
మహిమ: ఇక్కడ యమధర్మరాజు స్వయంగా అమ్మవారిని పూజించాడని ప్రతీతి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం.
D) లింగరాజ టెంపుల్ – భువనేశ్వర్ (Lingaraj Temple)
స్థల పురాణం: ఇక్కడ శివుడు ‘హరిహర’ (శివుడు మరియు విష్ణువు) రూపంలో దర్శనమిస్తాడు. పార్వతీ దేవి కోరిక మేరకు శివుడు భువనేశ్వర్ లో స్వయంభువుగా వెలిసాడని కథనం.
విశేషాలు: ఇది భువనేశ్వర్‌లోని అతి పురాతన మరియు అతిపెద్ద ఆలయం. ఇక్కడి శివలింగం చాలా విశాలంగా ఉంటుంది.
మహిమ: ఈ లింగానికి పూజ చేస్తే శివకేశవులిద్దరినీ పూజించిన ఫలం దక్కుతుంది. ఇక్కడ బిందు సరోవరంలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
2) వెస్ట్ బెంగాల్ (West Bengal)
A)కలకత్తా కాళికా మందిరం – దక్షిణేశ్వర్ (Dakshineswar Kali Temple)
స్థల పురాణం: రాణి రాష్మణికి కాళికా అమ్మవారు కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. రామకృష్ణ పరమహంస ఇక్కడే పూజారిగా ఉంటూ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారని చరిత్ర.
విశేషాలు: ఇక్కడ అమ్మవారిని ‘భవతారిణి’ (సంసార సాగరాన్ని దాటించే తల్లి) అని పిలుస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ 12 శివాలయాలు ఉండటం విశేషం. రామకృష్ణుల వారి పాదస్పర్శతో పునీతమైన నేల ఇది. ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు తప్పక కరుణిస్తుందని భక్తుల నమ్మకం.
B) కాళిఘాట్ టెంపుల్-కలకత్తాలో ఉన్న మరో ప్రాచీన కాళి మందిరం.
C) హౌరా బ్రిడ్జి (Howrah Bridge) ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కాంటిలివర్ వంతెన (స్తంభాలు లేని వంతెన). రన్నింగ్‌లో బస్సు/వాహనం నుండి హుగ్లీ నదిపై దీని నిర్మాణాన్ని వీక్షించడం ఒక గొప్ప అనుభూతి.(ఇక్కడ హల్టింగ్ లేదు.రన్నింగ్ లో దూరంనుండే విజిట్ ఉంటుంది)
3) జార్ఖండ్ (Jharkhand)వైద్యనాథ్ జ్యోతిర్లింగం (Baidyanath Jyotirlingam)
స్థల పురాణం: రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తుండగా, దేవతల మాయ వల్ల ఇక్కడ (డియోఘర్) దించాల్సి వచ్చింది. శివుడు రావణుడికి వైద్యం (చికిత్స) చేసిన ప్రదేశం కాబట్టి దీనికి ‘వైద్యనాథ్’ అని పేరు వచ్చింది.
విశేషాలు: ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు శక్తి పీఠం కూడా (సతీదేవి హృదయం పడిన చోటు అని కొందరి నమ్మకం).
మహిమ: ఇక్కడ శివుడిని దర్శించుకుంటే రోగాలు నయమవుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
4) అస్సాం (Assam)
ఎ) గౌహతి – కామాఖ్య శక్తి పీఠం (Kamakhya Shakti Peetham)
స్థల పురాణం: సతీదేవి యోని భాగం ఇక్కడ నీలాచల పర్వతంపై పడిందని, అందుకే ఇది అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైన పీఠమని ప్రతీతి.
విశేషాలు: ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు, యోని ఆకారంలో ఉన్న శిలని పూజిస్తారు. అక్కడి నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.
మహిమ: ప్రతి ఏటా జూన్ నెలలో ‘అంబుబాచి మేళా’ జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారు రజస్వల అవుతుందని, బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుందని అంటారు. సంతానం లేని వారికి, క్షుద్ర బాధలు ఉన్నవారికి ఇది గొప్ప పరిహార క్షేత్రం.
ఇతర దర్శనాలు: కామాఖ్యలోనే దశ మహావిద్యలకు సంబంధించిన తారాదేవి, చిన్నమస్తా దేవి, కాళికా మాత ఆలయాలు కూడా దర్శించుకుంటాము. బ్రహ్మపుత్రనది దర్శనం కూడా ఉంటుంది.

**యాత్ర సూచనలు మరియు నియమ నిభంధనలు పూర్తి గా ఇక్కడ చదవండి. https://ramthamedia.in/shree-tours-yatra-packages-terms-and-conditions/
1) *గమనిక యాత్రకు ఓరిజినల్ ఆధార్ కార్డు +3 ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.
2) ముందుగా ట్రైన్ లో సికింద్రాబాదు చర్లపల్లి టూ భువనేశ్వర్ కు డైరెక్ట్ 3.ఎ.సి.ట్రైన్ ఉంటుంది.తరువాత వరుసగా ఒరిస్సా దర్శనం ,కలకత్తా, జార్కండ్ బైధ్యానాధ్,అస్సాం గౌహతి కామఖ్య దర్శనం ఉంటాయి. రిటర్న్ గౌహతి నుండి బై ఫ్లైట్ ద్వారా రిటర్న్ హైదరాబాదుకు వస్తాము.
3)యాత్రలో ట్రైన్ దిగగానే యాత్రికులు ఎందరు ఉంటే అంతకు తగ్గసీట్ల మినిబస్/ టెంపో ట్రావెలర్ (ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,మరియు మిగితా,భైధ్యనాధ్ , గౌహతిలో నాన్ ఎ.సి. వెహికిల్స్ ఉంటాయి.వెహికిల్ లో లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు వెహికిల్ లో డైలి 1 వరుస వెనక్కి జరగాలి.
4)యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం లంచ్,1లీటర్ మినరల్ బాటిల్,సాయంత్రం టీ,రాత్రి అల్పాహరం ఉంటుంది. (ట్రైన్ లో మొదటిరోజు చర్లపల్లి టూ భువనేశ్వర్ వరకు ట్రైన్ ప్రయాణంలో మా తరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు. యాత్రికులు హొంపుడ్ తెచ్చుకోవడం కాని ట్రైన్ లో స్వంతంగా ఫుడ్ కాని తీసుకోవచ్చును. భువనేశ్వర్ చేరకున్నదగ్గరినుండి రిటర్న్ గౌహతిలో ప్లైట్ ఎక్కేవరకుమా తరుపునే ఫుడ్ అరెంజ్ మెంట్ ఉంటుంది.
5). 3 రాత్రులు హోటల్ రూం లో నైట్ స్టే స్ . @1 నైట్ భువనేశ్వర్,(నాన్ ఎ.సి.రూం),1 నైట్ కలకత్తా లో (ఎ.సి.రూం) ,+1నైట్ కామాఖ్య లో (ఎ.సి.రూం), ఫ్యామిలికి 1 రూం.(2-3) సింగిల్స్ గా వచ్చేవారికి సింగిల్ హోటల్ రూం అలాట్ కు రూ.4000 అదనం )
6)యాత్రలో సమయభావం,ట్రాఫిక్, సమస్యలు,అధిక రద్ది కారణంగా మద్యలో ఏదేని టెంపల్ దర్శనం మిస్ కావచ్చును.తదుపరి ట్రైన్ టైం ప్రకారం అందుకోవాలి. టెంపుల్ కు టూర్ ఆపరేటర్ ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా రావాలి.
7)యాత్రమద్యలో ఏకారణాలతోనైనా కూడా ఏదైనా ట్రైన్ కేన్సిల్ అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తదుపరి గమ్య స్థానం వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే పేచేయాలి.
8)వెహికిల్ వెళ్ళని చోట్లకు షేరింగ్ ఆటో చార్జీలు, బోటు ప్రయాణం,స్పెషల్ ధర్శనాలు,పూజలు , అభిషేకాల చార్జీలు అదనం.(కామాఖ్యలో ప్రత్యేక దర్శనం 1500 అదనం, జార్కండ్ బైధ్యనాధ్ జ్యోతిర్లింగంలో సుమారు రూ.300 అదనం, పూరి జగన్నాధ్ లో ప్రత్యేక దర్శనం సుమారు రూ.300 అదనం.
9) డ్రైవర్ టిప్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరు రూ.150 అదనంగా పేచేయవలెను.
సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542 Non Refundable Advance Rs.20,000 to Gpay/Phonepay 8985246542 Ravinder, Shree Tours.,.( నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ + డ్రైవర్ టిప్150 భువనేశ్వర్ లో క్యాష్ గా పేచేయాలి.
Share your love
A. Ravinder, RamthaMedia
A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

Articles: 275