శ్రీటూర్స్ యాత్రికులకు బిగ్గెస్ట్ అప్‌డేట్: యాత్రికుల కంప్లైంట్స్ – శ్రీటూర్స్ సమాధానాలు మరియు కొత్త ప్యాకేజీల వివరాలు

శ్రీటూర్స్ యాత్రలకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్, టూర్ ప్యాకేజీల వివరాలు యాత్రికులు తప్పక తెలుసుకోవాల్సిన నియమ నిబంధనలు చదవండి.

యాత్ర అనగానే మనసుకు ఎంతో ప్రశాంతత, దైవ దర్శన భాగ్యం, కొత్త ప్రదేశాల సందర్శన గుర్తుకొస్తాయి. ఎంతో మంది యాత్రికుల కలలను సాకారం చేస్తూ, “శ్రీటూర్స్” (Shree Tours) ఎన్నో విజయవంతమైన యాత్రలను గత 11 ఏళ్ళుగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ప్రతి ప్రయాణంలోనూ కొన్ని అనుభవాలు, మరికొన్ని అభిప్రాయాలు సహజం. ఇటీవల శ్రీటూర్స్ ద్వారా యాత్రలు చేసిన కొందరు యాత్రికుల నుంచి ప్రధానంగా రెండు పెద్ద కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చాయి.

శ్రీటూర్స్ కు యాత్రికుల సంతృప్తే మా ప్రథమ ప్రాధాన్యం. కాబట్టి, ఆ కంప్లైంట్స్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటి? తెర వెనుక జరిగే శ్రమ ఏమిటి? అలాగే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మేము తీసుకురాబోతున్న “బిగ్గెస్ట్ అప్‌డేట్” ఏమిటి? అన్న విషయాలను టూర్ ఆపరేటర్ ఎ.రవీందర్ ఈ ఆర్టికల్ ద్వారా చాలా స్పష్టంగా, వివరంగా మీ ముందుకు తీసుకువస్తున్నాడు. యాత్రకు వచ్చేవారు చాలా మంది యాత్రికులు  కేవలం టూర్ ప్యాకేజి ఎంత, ఎన్ని డేస్,ఎమేం చూస్తాం అనేదొక్కటే చూస్తారు తప్ప ఇక్కడ దిగువ ఇచ్చిన యాత్ర నియమ నిభందనలు చదవరు..ప్రతి యాత్రలో కూడా మా వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ నియమ నిభంధనలన్ని ఉంటాయి…

కంప్లైంట్ 1: టెంపుల్స్ దగ్గర తొందరపెట్టడం మరియు కొన్ని టెంపుల్స్ మిస్ అవ్వడం! ఇదే అతి పెద్ద కంప్లైంట్…

యాత్రికుల అభిప్రాయం: “యాత్ర సమయంలో గుడి దగ్గర ప్రశాంతంగా గడిపే సమయం ఇవ్వడం లేదు. లిమిటెడ్ టైమ్ మాత్రమే ఇచ్చి త్వరగా రండి, రండి అని బాగా తొందర పెడుతున్నారు. దీనివల్ల హడావుడి అవుతోంది, పైగా మధ్యలో కొన్ని టెంపుల్స్ మిస్ అవుతున్నాయి.”

శ్రీటూర్స్ సమాధానం మరియు అసలు వాస్తవం: యాత్రకు వెళ్ళే ముందు ఏ రోజు ఎక్కడ ఉండాలి, ఏయే టెంపుల్స్ చూడాలి, ఒక్కో చోట ఎంత సమయం గడపాలి అని ఒక పక్కా షెడ్యూల్ ముందుగానే ప్లాన్ చేయబడుతుంది. దాని ప్రకారమే టూర్ నడుస్తుంది.

ఒక చిన్న లాజిక్ ఆలోచించండి… మీరు స్వంతంగా, మీ సొంత కారులో మీ కుటుంబంతో కలిసి ఒక ప్లాన్ లేకుండా యాత్రకు వెళ్లారనుకుందాం. ఏ రోజు ఏ గుడి చూడాలి, ఎన్ని గంటలకు ఎక్కడ ఉండాలి అనే టైమ్ సెన్స్ (Time Discipline) పాటించకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ రోజు చూడాల్సిన వాటిలో ఏదో ఒక టెంపుల్ మిస్ అవుతుంది కదా? టూర్ ఆపరేటర్‌తో వెళ్లినా, స్వంతంగా వెళ్లినా ‘సమయపాలన’ (Time Discipline) అనేది ఎక్కడైనా పాటించాల్సిందే. అది తప్పితే ఏ యాత్రలో అయినా దేవుని దర్శనాలు మిస్ అవ్వడం ఖాయం.

చాలామంది అపార్థం చేసుకున్న దాంట్లో ఉన్న “రివర్స్ నిజం” ఇదే!

ఇక్కడ చాలామంది యాత్రికులు పూర్తిగా మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటున్న ఒక పెద్ద విషయం ఉంది. టూర్ ఆపరేటర్ మిమ్మల్ని తొందరపెడుతున్నాడు అంటే… తన స్వార్థం కోసం కాదు. యాత్రికులకు తక్కువ ఖర్చులో, తక్కువ రోజుల్లో, సాధ్యమైనన్ని ఎక్కువ టెంపుల్స్ చూపించాలి అనే ఒకే ఒక్క తాపత్రయం మాత్రమే టూర్   ఆపరేటర్‌లో ఉంటుంది.

దీనికోసం టూర్ ఆపరేటర్  నిరంతంర  శ్రమిస్తూ, వెహికల్ డ్రైవర్లను సమన్వయం చేస్తూ, వారిని శ్రమపెడుతూ, యాత్రికులను కూడా అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపిస్తాడు. మీ డబ్బు మరియు సమయం వృధా కాకూడదనే ఉద్దేశ్యంతోనే టూర్ ఆపరేటర్ అలా చేస్తాడే తప్ప, యాత్రను కావాలని హెక్టిక్‌గా మార్చాలని కాదు. “రెస్ట్ లేకుండా తిప్పుతున్నారు” అనే మాటలో ఏమాత్రం వాస్తవం లేదు. మీ జేబుకు చిల్లు పడకుండా, అద్భుతమైన దర్శనాలు చేయించాలనేదే దీని వెనుక ఉన్న అసలు రహస్యం!

శ్రీటూర్స్ బిగ్గెస్ట్ అప్‌డేట్: రెండు కొత్త ప్యాకేజీల పరిచయం

యాత్రికుల సౌలభ్యం కోసం, ఈ తొందరపెట్టే విధానానికి చెక్ పెడుతూ శ్రీటూర్స్ ఒక సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తోంది. దీనికి బీజం ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే పడింది.

రెండు ఏళ్ల క్రితం తమిళనాడు యాత్రకు వెళ్ళి వస్తున్న సమయంలో… యాత్రికురాలు మంగమ్మ గారి భర్త శ్రీ అరుణ్ కుమార్ గారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. “యాత్రలో రిలాక్స్‌గా తిరుగుదాము అనుకునే వారి కోసం యాత్ర రోజులను (Days) డబుల్ చేసి, ఖర్చును కూడా డబుల్ చేసి ప్యాకేజీ పెట్టండి. అప్పుడు ఎవరికి ఏది కావాలో వారే స్వయంగా ఎంచుకుంటారు కదా” అని అపుడు అరుణ్ కుమార్ గారు సూచించారు. అది ఇంత వరకు పాటించలేదు . ఇకపై పాటిస్తాము.(ఐదేళ్ళ క్రితం పంచారామాల యాత్రకు వెళ్ళి వస్తుంటే బస్ లో సీట్లు దగ్గర పెద్ద ఎత్తున గొడవ జరిగినప్పుడు ఓక యాత్రకుడు ఇచ్చిన సలహా..ప్రంట్ సీట్ అవసరమైన వారికి కావాలంటే అదనంగా రూ.1000 పెట్టండి అనేదొక్కటి మాత్రమే తక్షణం పాటించాము)

ఉదాహరణకు తమిళనాడులో 20 టెంపుల్స్ దర్శనం ఉంటే… సమయం తక్కువ ఉన్నప్పుడు 10 టెంపుల్స్ మాత్రమే చూడటం ఒక పద్ధతి. లేదు, అన్నీ ప్రశాంతంగా చూడాలి అనుకుంటే యాత్ర రోజులను రెట్టింపు చేయడం మరొక పద్ధతి.

ఈ సూచనను పరిగణనలోకి తీసుకుని, ఇకపై శ్రీటూర్స్ ద్వారా ఏ యాత్రకైనా రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాము. యాత్రికులు తమ బడ్జెట్, సౌలభ్యాన్ని బట్టి ఈ రెంటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.

📦 ప్యాకేజి 1: తక్కువ ఖర్చు – ఎక్కువ దర్శనాలు (రెగ్యులర్ ప్యాకేజి)

      • విధానం: ఇప్పటి వరకు నడుస్తున్న ప్రస్తుత పద్ధతి.

      • ప్రత్యేకత: తక్కువ రోజుల్లో, తక్కువ ఖర్చుతో, సాధ్యమైనన్ని ఎక్కువ టెంపుల్స్ చూసి రావడం.

      • ఎవరికి సూటబుల్? బడ్జెట్ తక్కువగా ఉండి, కాస్త శ్రమపడినా పర్వాలేదు, ఎక్కువ గుళ్ళు చూడాలి అనుకునే చురుకైన వారికి ఇది బెస్ట్. (ఇందులో టైమ్ మేనేజ్మెంట్ కోసం కాస్త హడావుడి తప్పదు).

    📦 ప్యాకేజి 2: డబుల్ డేస్ – డబుల్ కంఫర్ట్ (లీజర్ ప్యాకేజి)

        • విధానం: డబుల్ ఖర్చు మరియు డబుల్ డేస్ (రోజులు).

        • ప్రత్యేకత: ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్నీ కవర్ అవుతాయి, కానీ రోజులు రెట్టింపు అవుతాయి. దీనివల్ల ప్యాకేజి 2 లో బోలెడంత లీజర్ టైం ఉంటుంది.

        • ఎలాంటి ఇబ్బంది ఉండదు: ఈ ప్యాకేజీలో ఎవరినీ తొందరపెట్టాల్సిన పనే లేదు. టూర్ ఆపరేటర్‌కు, వెహికల్ డ్రైవర్‌కు, మరియు యాత్రికులకు కూడా బోలెడంత రెస్ట్ దొరుకుతుంది. ప్రతిరోజూ సాయంత్రం కల్లా ఆ రోజు యాత్ర ప్రశాంతంగా ముగుస్తుంది. గుడి దగ్గర ఎంత సేపైనా ఉండొచ్చు.

        • ఎవరికి సూటబుల్? యాత్రను చాలా రిలాక్స్‌గా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆస్వాదించాలి అనుకునే వారు కచ్చితంగా ఈ ప్యాకేజి 2 నే బుక్ చేసుకోవాలి.

      కంప్లైంట్ 2: షాపింగ్ చేసుకోవడానికి టైం ఇవ్వడం లేదు!

      యాత్రికుల అభిప్రాయం: “టెంపుల్స్ అన్నీ చూపిస్తున్నారు కానీ, కనీసం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం లేదు.”

      శ్రీటూర్స్ సమాధానం మరియు ఆర్థిక లెక్కలు: ఇది కూడా వాస్తవం కాదు. గుడికి వెళ్లి వస్తున్నప్పుడు, దారి మధ్యలో షాపుల్లో ఏదైనా నచ్చితే సింపుల్ గా కొనుక్కుని రావడం అనేది యాత్రలో భాగం. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. కానీ, ప్రత్యేకించి “షాపింగ్ కోసమే” గంటల తరబడి టైమ్ కేటాయిస్తే ఏమవుతుంది? అల్టిమేట్‌గా యాత్ర రోజులు (Tour Days) పెరుగుతాయి.

      యాత్ర డేస్ పెరిగితే దాని భారం నేరుగా యాత్రికుల జేబు మీదే పడుతుంది. ఎలాగో లెక్క వేసుకోండి: ఒక రోజు యాత్ర పెరిగితే… ఆ రోజుకు వెహికల్ ఖర్చు + హోటల్ రూమ్ అద్దె + మూడు పూటలా ఫుడ్… అంతా కలిపి ఒక మనిషికి రోజుకు కనీసం రూ. 2500/- చొప్పున అదనపు ఖర్చు పెరుగుతుంది.

      మీరు కొనేది వెయ్యి రూపాయల చీర అయితే, ఆ షాపింగ్ కోసం టైం తీసుకుని టూర్ ఒక రోజు ఎక్స్‌టెండ్ అయితే, మీరు అదనంగా 2500 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి షాపింగ్ కోసం పెరిగే ఈ అదనపు ఖర్చును లెక్కవేసుకుంటే, “షాపింగ్ కు టైం ఇవ్వడం లేదు” అనే కంప్లైంట్ ఏ యాత్రికుడికీ రాదు.

      మా సలహా: ఒకవేళ మీకు షాపింగ్ చేయడానికి పుష్కలంగా సమయం కావాలి అనుకుంటే, మీరు యాత్ర ప్యాకేజి 2 ని ఎంచుకోండి. అందులో సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీ షాపింగ్ ముచ్చట కూడా ఎలాంటి హడావుడి లేకుండా తీరుతుంది.

      ముగింపు

      శ్రీటూర్స్ ఉద్దేశ్యం ఎప్పుడూ యాత్రికులకు అత్యుత్తమ సేవలు అందించడమే. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పడే అపోహలను తొలగించడానికే ఈ స్పష్టమైన వివరణ. ఇకపై మీ యాత్రా శైలిని బట్టి, మీ బడ్జెట్ ను బట్టి ప్యాకేజి 1 లేదా ప్యాకేజి 2 ని ఎంచుకోండి. ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా ఆ దైవ కృపతో మీ యాత్రను సాఫీగా, ఆనందంగా పూర్తి చేసుకోండి!

      శ్రీటూర్స్ యాత్ర నియమ నిబంధనలు మరియు ముఖ్య సూచనలు

      శ్రీటూర్స్ ద్వారా యాత్రలకు విచ్చేస్తున్న యాత్రికులకు స్వాగతం. మీ యాత్ర అత్యంత సాఫీగా, ప్రశాంతంగా సాగాలన్నదే మా లక్ష్యం. గ్రూప్ యాత్రల్లో అందరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కింద పేర్కొన్న నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది. యాత్రకు బుక్ చేసుకునే వారు ఖచ్చితంగా ప్రతి యాత్రకు ప్రతి ఒక్కరు ఈ నియమ నిభందనలు చదవండి. యాత్రకు బుక్ చేసుుకన్నారంటేనే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు అంగీకరించినట్లుగా భావించబడుతుంది.

      1. ప్రయాణం మరియు భోజన సదుపాయాలు

          • అప్ & డౌన్ జర్నీలో భోజనం: మీ స్వంత ఊరి నుండి యాత్రా స్థలానికి వెళ్లేటప్పుడు (Up Journey), అలాగే యాత్ర ముగిశాక తిరిగి వచ్చేటప్పుడు (Down Journey) ట్రైన్ ప్రయాణాలలో టూర్ ఆపరేటర్ తరపున ఎలాంటి భోజన సదుపాయం ఉండదు. యాత్రికులు ఇంటి భోజనం తెచ్చుకోవడం లేదా ట్రైన్‌లో సొంతంగా సమకూర్చుకోవాలి.

          • యాత్రలో భోజనం: యాత్రా స్థలానికి చేరుకున్న దగ్గరి నుండి (ఉదా: భువనేశ్వర్ లేదా సంబంధిత ప్రదేశం) తిరిగి ప్రయాణం ప్రారంభించే వరకు సంస్థ తరపున భోజన సదుపాయం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం టీ/టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రికి టిఫిన్/అల్పాహారం, మరియు రోజుకు 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్ అందించబడుతుంది.

        2. స్నానాలు – ఫ్రెష్-అప్ ఛార్జీలు (ముఖ్య గమనిక)

            • నదీ స్నానాలు: కొన్ని యాత్రల్లో ఉదయం ట్రైన్ దిగగానే నేరుగా పవిత్ర నదీ స్నానాలు ఉంటాయి. (ఉదాహరణకు: మధ్యప్రదేశ్ యాత్రలో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదా నది స్నానం, కర్ణాటక యాత్రలో శ్రీరంగపట్నంలో కావేరి నది స్నానం తదితరాలు).

            • ఫ్రెష్-అప్ అదనపు ఖర్చు: యాత్రలో హోటల్ రూమ్ లో నైట్ స్టే (రాత్రి బస) లేని రోజుల్లో, అనగా ఉదయం ట్రైన్ దిగగానే కేవలం స్నానాలు చేయడానికి (ఫ్రెష్-అప్ కోసం) తీసుకునే రూమ్స్ లేదా ఇతర సదుపాయాల ఛార్జీలు అదనంగా ఉంటాయి. వీటిని యాత్రికులే స్వయంగా భరించాలి.

          3. హోటల్ వసతి, బస మరియు లిఫ్ట్ (Elevator) సదుపాయం

              • రూమ్ కేటాయింపు: కుటుంబానికి (2 లేదా 3 వ్యక్తులకు) ఒక హోటల్ రూమ్ కేటాయించబడుతుంది. ఒంటరిగా (సింగిల్స్ గా) వచ్చేవారికి సింగిల్ రూమ్ కావాలంటే పర్ డే రూ.1000 అదనంగా చెల్లించాలి.

              • లిఫ్ట్ మరియు నాన్-ఏసీ రూమ్స్: యాత్రల్లో బస చేసే నాన్-ఏసీ (Non-AC) హోటల్స్ చాలా వరకు లిఫ్ట్ సదుపాయం లేనివే ఉంటాయి. కాబట్టి లిఫ్ట్ లేని హోటల్స్ లో మొదటి లేదా రెండవ అంతస్తు (1st & 2nd Floors) కు మెట్లు ఎక్కి వెళ్లడానికి యాత్రికులు మానసికంగా సిద్ధపడి ఉండాలి. కొన్ని నాన్ ఎ.సి.రూంలలో ఇండియన్ టాయిలెట్ కూడా ఉంటుంది… సాధ్యమైనంత వరకు సీనియర్ సిటిజన్స్ కు కింది ప్లోర్ లలో , యంగ్ ఏజి వారికి పై ప్లోర్స్ లలో రూంస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఉన్న రూంస్ లలో ఏ ఇబ్బంది ఉండదు.

              • ఏసీ అప్‌గ్రేడ్: తప్పనిసరిగా లిఫ్ట్ ఉన్న హోటల్స్ కావాలనుకునే వారు కచ్చితంగా ఏసీ (AC) రూమ్స్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ఏసీ రూమ్ కోసం ఒక్కొక్కరికి ఒక రాత్రికి (Per Night) రూ. 500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.(ఎ.సి.రూం అంటే ఎ.సి.కోసం కాదు …మరింత కంపర్ట్ విత్ లిప్ట్ పెసిలిటి,విత్ వెస్ట్రన్ టాయిలెట్ తో అని అర్థం)

            4. వాహనం మరియు సీటింగ్ నిబంధనలు

                • వాహన సదుపాయం: యాత్రికుల సంఖ్య, ప్రాంతాన్ని బట్టి బస్, మినీ బస్ లేదా టెంపో ట్రావెలర్ (AC/Non-AC) ఏర్పాటు చేయబడుతుంది.

                • ఫ్రంట్ సీట్ రిజర్వేషన్: వాహనంలో ముందు సీట్లు (Front Seats) కావాలనుకునే వారు ఒక్కొక్కరికి రూ. 800 అదనంగా చెల్లించాలి.(దీనికి కారణం యాత్ర అంతా నిర్హహించడం ఒక ఎత్తు ఐతే సీట్ల దగ్గర మేము ముందు కూర్చుంటాము అంటే మేము ముందు కూర్చుంటాము అని వెహికల్ డైలి గొడవలు జరుగుతుంటాయి…సీట్లు రోటేషన్ లో జరుగని వారు ముందే అదనంగా పేచేసి ప్రంట్ సీట్లు రిజర్వ్ చేసుకోండి అప్పుడు వెహికిల్ లో డైలి సీట్లు జరుగాల్సిన అవసరమే ఉండదు.

                • సీటింగ్ రొటేషన్: ఫ్రంట్ సీట్లు బుక్ చేసుకోని మిగతా యాత్రికులందరూ ప్రతిరోజూ సీటింగ్ రొటేషన్ పద్ధతిలో విధిగా ఒక సీటు వరుస వెనక్కి జరగాల్సి ఉంటుంది.

              5. అదనపు ఖర్చులు – యాత్రికుల బాధ్యతలు

                  • ఆటోలు & పార్కింగ్: టూర్ వాహనం కేవలం పార్కింగ్ స్థలం వరకే వస్తుంది. వాహనం వెళ్లని ఇరుకు లేదా కొండ ప్రదేశాలకు, పార్కింగ్ నుండి టెంపుల్ కు వెళ్లేందుకు అయ్యే షేరింగ్ ఆటో ఛార్జీలు యాత్రికులే భరించాలి.

                  • దర్శనాలు మరియు పూజలు: ఎంట్రన్స్ టికెట్లు, స్పెషల్ దర్శనాలు, వ్యక్తిగత పూజలు, అభిషేక ఖర్చులు మరియు బోటు ప్రయాణ ఖర్చులు యాత్రికులదే బాధ్యత. (ఉదా: కామాఖ్య ప్రత్యేక దర్శనం రూ.1000-1500, బైద్యనాథ్ సుమారు రూ.300, పూరీలో రూ.300 అదనం).రోప్ వేలు,బోటింగ్ , స్పెషల్ ఎంట్రెన్స్ టికెట్స్,పూజలు,అభిషేకాలు అదనంగా ఉంటాయి.

                  • అనుకోని ప్రయాణ ఖర్చులు:వాత వరణం,పక్రుతి ,వర్షాలు, ట్రైన్ క్యాన్సిల్ వంటి అనివార్య కారణాల వల్ల ప్రైవేట్ బస్సుల్లో తదుపరి గమ్యస్థానానికి వెళ్లాల్సి వస్తే, ఆ అదనపు ఛార్జీలను యాత్రికులే చెల్లించాలి.

                  • డ్రైవర్ టిప్: యాత్ర ముగిసే సమయంలో వాహన డ్రైవర్ టిప్ కింద ఒక్కొక్కరు రూ. 100 -150 అదనంగా ఇవ్వాలి.

                6. సమయపాలన మరియు టూర్ ఆపరేటర్ సూచనలు

                    • టైమ్ డిసిప్లిన్: యాత్రకు డే-వైజ్ ప్రోగ్రామ్ ముందే నిర్ణయించబడుతుంది. టూర్ ఆపరేటర్ చెప్పిన సమయానికి యాత్రికులు కచ్చితంగా వాహనం వద్దకు రావాలి.

                    • దర్శనాలు మిస్ అవ్వడం: సమయాభావం, విపరీతమైన ట్రాఫిక్, ప్రకృతి ఇబ్బందులు లేదా ఒక టెంపుల్ దగ్గర ఎక్కువ రద్దీ వల్ల ఆలస్యం జరిగితే, తదుపరి ప్రయాణం కోసం ఏదైనా దర్శనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి టూర్ ఆపరేటర్ బాధ్యులు కారు మరియు ఇందులో ఆపరేటర్‌దే తుది నిర్ణయం. యాత్రికుల సౌకర్యార్ధమే సమాయానుకూలంగా ఏది బెస్ట్ నిర్ణయమో టూర్ అపరేటర్ తీసుకుంటాడు.

                  7. ట్రైన్ రిజర్వేషన్లు మరియు బెర్తుల కేటాయింపు (ముఖ్య గమనిక)

                  • లోయర్ బెర్త్‌ల లభ్యత: యాత్ర కోసం రైలు ప్రయాణాలకు రిజర్వేషన్స్ చేసేటప్పుడు, వృద్ధులను (సీనియర్ సిటిజన్స్) దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు వారికి లోయర్ బెర్త్ (Lower Berth) వచ్చేలా బుక్ చేయడానికి టూర్ ఆపరేటర్ వంద శాతం ప్రయత్నిస్తారు.

                  • బెర్త్‌లతో అడ్జస్ట్‌మెంట్: రైల్వేలో బెర్తుల లభ్యతను బట్టి రిజర్వేషన్ పూర్తయిన తర్వాత ఏ బెర్త్ వస్తే (మిడిల్ లేదా అప్పర్) దాన్ని యాత్రికులు కచ్చితంగా అంగీకరించాల్సిందే. “మేము సీనియర్స్ కదా, మాకు మిడిల్/అప్పర్ బెర్త్ ఎలా వచ్చింది?” అని వాదించడం లేదా గొడవ పడటం సరికాదు.

                  • ఆచరణాత్మక ఇబ్బందులు (టూర్ ఆపరేటర్ కష్టం): గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికీ లోయర్ బెర్త్ లే బుక్ చేయడం ఎవరికైనా అసాధ్యమైన పని. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రిజర్వేషన్ ఫామ్‌లో అందరినీ ఒకేసారి బుక్ చేయడం సాధ్యం కాదు (ముఖ్యంగా సీనియర్ కోటాలో). దీని వెనుక టూర్ ఆపరేటర్ పడే కష్టం ఎలా ఉంటుందో దయచేసి యాత్రికులు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు… గ్రూపులో 20 మంది యాత్రికులు ఉంటే, 4 ట్రైన్లకు బుక్ చేయడానికి ప్రతి ట్రైన్‌కు కనీసం 10 ఫారాలు నింపాలి. అలాగే 3 నైట్ ట్రైన్స్ అయితే ఏకంగా 30 ఫారాలు నింపాల్సి ఉంటుంది.

                  • రిజర్వేషన్ల వెనుక ఉన్న శ్రమ: సికింద్రాబాద్ లాంటి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్ లైన్‌లో గంటల తరబడి నిలబడితే, కౌంటర్ లోని క్లర్క్ ఒకేసారి ఒక ఫామ్ మాత్రమే తీసుకుంటాడు. మళ్లీ రెండో ఫామ్ ఇవ్వాలంటే ఆపరేటర్ తిరిగి లైన్‌లో చివరన వెళ్లి నిలబడాలి. ఇలా 30 ఫారాలు పూర్తి చేసి, గ్రూప్ అందరికీ ఒకే ట్రైన్‌లో టికెట్లు సాధించడానికి కనీసం 2 రోజులు కేవలం రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్దే గడపాల్సి వస్తుంది.

                  ఇంత కష్టపడి టికెట్లు కన్ఫర్మ్ చేయించడమే ఒక పెద్ద ప్రయాస. కాబట్టి యాత్రికులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, బెర్తుల కేటాయింపు విషయంలో టూర్ ఆపరేటర్‌కు సహకరించాలని కోరుతున్నాము. లేదంటే యాత్రకు అడ్వాన్స్ పేచేసాక టూర్ అపరేటర్ మీకు వెళ్ళి వచ్చే ట్రైన్స్ వివరాలు ఇస్తాడు. ఆ ట్రైన్ వివరాల ప్రకారంగా యాత్రికులే స్వంతంగా లోయర్ బెర్తల రిజర్వేషన్ చేసుకోవచ్చును.

                  అత్యంత ముఖ్యమైన మరియు అంతిమ నిబంధన (Ultimate Rule)

                  పైన పేర్కొన్న యాత్రా నియమ నిబంధనలన్నీ స్పష్టంగా చదివి, వాటి ప్రకారం నడుచుకుంటామని వందశాతం అంగీకార యోగ్యంగా ఉంటే మాత్రమే శ్రీటూర్స్ యాత్రకు బుక్ చేసుకోండి.

                  లేదంటే యాత్రికులు తమకు నచ్చిన విధంగా, తమ సౌకర్యార్థం స్వంతంగా యాత్ర ప్లాన్ చేసుకోవచ్చు. అంతేతప్ప, గ్రూపు యాత్రకు వచ్చి “ఇది బాలేదు… అది బాలేదు…” అని ప్రతి చిన్నదానికీ వంకలు పెడుతూ టూర్ ఆపరేటర్‌తో గొడవ పడేవారు, యాత్రా సమయంలో తోటి యాత్రికుల ప్రశాంతతను, మూడ్‌ను చెడగొట్టేవారు దయచేసి ఏ  గ్రూపు యాత్రలకు వెళ్ళవద్దు.. అలాంటి వారు స్వంతంగా యాత్రలకు వెళ్లడమే మీకూ, తోటి యాత్రికులకూ, మరియు టూర్ ఆపరేటర్‌కూ అందరికీ అత్యుత్తమం.

                  Share your love
                  A. Ravinder, RamthaMedia
                  A. Ravinder, RamthaMedia
                  Articles: 162

                  Leave a Reply

                  Your email address will not be published. Required fields are marked *