కర్ణాటక యాత్ర 14-10-26@8P.M. సికింద్రాబాదు నుండి అప్ డౌన్ బై ఎ.సి. ట్రైన్(రిటర్న్ 19-10-26 @5A.M) విత్ +నాన్ ఎ.సి.రూంస్,ఫుడ్+ యాత్రలో ఎ.సి.వెహికిల్ తో ఒక్కరికి రూ.13,900.బుకింగ్ చివరి తేధి 27-9-26.

కర్ణాటకలోని గోకర్ణ, మురుడేశ్వర్,కుక్కి సుబ్రమణ్యం, ధర్మస్థల,శ్రుంగేరి,హొర్నాడు అన్నపూర్ణ, ఉడిపి,కొల్లూర్ మూకాంబిక దేవి వంటి దివ్య క్షేత్రాలను శ్రీ టూర్స్ ప్యాకేజీ ద్వారా దర్శించుకోండి.

కర్ణాటక యాత్ర 14-10-26 up down బై 3 AC ట్రైన్(Secunderabad to Bengalore @8pm,Return to Kachiguda on 19-10-26 @ 5 am) కర్ణాటక యాత్రలో బెంగుళూరు నుండి ఎ.సి.టెంపో ట్రావెలర్ ఉంటుంది.  booking last date 27-9-26 .Call – Shree Tours-8985246542.నాన్ ఎ.సి.రూంలతో నైట్ స్టే, విత్ భోజనంతో (ఉదయం టీ,టిఫిన్+ మధ్యాహ్న భోజనం,సాయంత్రం టీ, రాత్రి ఏదేని టిఫిన్/ అల్హాహారం(లైట్ ఫుడ్ = నాట్ డిన్నర్) ఒక్కరికి రూ.13,900కే విత్ 3 నైట్ స్టే నాన్ ఎ.సి. హోటల్ రూంస్ @ at Kukki Subramanyam, Murudeswer, Hornadu . Ac rooms 3 nights rs.3000 extra per room per couple) for single person rs.2000 extra for single non AC room allotment) .నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా ఒక్కరు రూ.8000 పేచేయవలెను, Phonepay/GPay to 8985246542, A.Ravinder. బ్యాలెన్స్ యాత్రలో ట్రైన్ దిగాక బెంగుళూర్ లో పేచేయవలెను.

కర్ణాటక యాత్రలో దర్శించే యాత్ర క్షేత్రాలు.

* 1.గోకర్ణం -మహాబలేశ్వర ఈశ్వర ఆలయం, 2. మురుడేశ్వర్- శివ మందిరం, 3. కొల్లూరు- శ్రీ మూకాంబికా దేవాలయం, 4. శృంగేరి- శారదాంబ విద్యాశంకర దేవాలయం, 5. హొరనాడు -శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం, 6. ధర్మస్థల- శ్రీ మంజునాథ ఆలయం, 7. కుక్కి- సుబ్రహ్మణ్య దేవాలయం, 8. ఉడిపి-శ్రీ కృష్ణ మందిరం 9. శ్రీరంగపట్నం- రంగనాధ స్వామి టెంపుల్. 10.మైసూరు-చాముండేశ్వరి అష్టాదశ శక్తిపీఠం.11.బేలూరు చెన్నకేశవ దేవాలయం..

***********************************

కర్ణాటక యాత్ర నియమ నిభంధనలు* యాత్రలో స్పెషల్ దర్శనాలు, ఎంట్రెన్స్ టికెట్స్ అదనం చార్జీలు వర్తిస్తాయి. వెహికిల్ పార్కింగ్ స్థలం వరకు మాత్రమే వస్తుంది. వర్తించే దగ్గర పార్కింగ్ స్థలం నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు అదనం.యాత్రలో-భొజనం-ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ, మరియు టిఫిన్ ఉంటుంది.(అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మా తరుపున ఫుడ్ ఉండదు,యాత్రికులే సమకూర్చుకోవాలి, డ్రైవర్ టిప్ రూ.100 అదనం,యాత్రలో బెంగుళూరులో ట్రైన్ దిగాక మొదటిరోజు శ్రీరంగ పట్నంలో కావేరి నధి స్నానం ఉంటుంది. తరువాత పక్కనే కల శ్రీరంగ పట్నం శ్రీరంగనాధుడి దర్శనం,తరువాత మైసూర్ చాముండేశ్వరి దర్శనం తరువాత నైట్ స్టే హోటల్ రూం కుక్కి సుబ్రమణ్యంలో ఉంటుంది.డేవైస్ ప్రొగ్రాం యాత్రలో చెప్పబడుతుంది.టూర్ ఆపరేటర్ చెప్పిన టైం ఖచ్చితంగా టైం డిసిప్లీన్ తో ఫాలో కావాలి, లేదంటే యాత్రలో చూడాల్సిన క్షేత్రాల్లో ఏదో ఒకటి మిస్ అయితే టూర్ అపరేటర్ బాధ్యులు కారు.యాత్రలో పక్రుతి ఇబ్బందులు,ట్రాఫిక్ జాం లు, ఇతర టెంపుల్స్ లలో లేట్ కారణంగా చూడాల్సిన టెంపుల్స్ లలో ఏదేని మిస్ కావచ్చును,అంతిమ నిర్ణయం టూర్ ఆపరేటర్ దే.పై నియమ నిభంధనలకు సిధ్ధపడ్దవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరు. శ్రీటూర్స్ కర్ణాటక యాత్ర ప్యాకేజిలో తక్కువ ఖర్చుతో , తక్కువ రోజుల్లో ఎక్కువ క్షేత్రాలు దర్శించుకునేలా టూర్ ప్రొగ్రాం చేయబడ్డవి.

కర్ణాటక యాత్ర క్షేత్ర మహత్యాలు.

1.గోకర్ణం – శ్రీ మహాబలేశ్వర ఈశ్వర ఆలయం:
ఈ కర్ణాటక యాత్రలో శివుడి అనుగ్రహం పొందడానికి మీరు చేసే మొదటి అడుగు గోకర్ణంలోని శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఇక్కడ ఆత్మలింగం దర్శనం చేసుకునేటప్పుడు, శివుడి అనంత శక్తిని మీ ఆత్మలో అనుభవిస్తారు. అరేబియా సముద్ర తీరాన నెలకొన్న ఈ పురాతన ఆలయం, మీ మనసుకు అంతులేని ప్రశాంతతను అందిస్తుంది.

2.మురుడేశ్వర్ – శ్రీ మురుడేశ్వర శివ మందిరం:

సముద్ర తీరంలో కొలువై ఉన్న 123 అడుగుల ఎత్తైన భారీ శివ విగ్రహాన్ని చూసినప్పుడు మీ కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తాయి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివ విగ్రహం ఇది. అరేబియా సముద్రపు నీలి రంగు నేపథ్యంలో ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి దేవాలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం కూడా. విగ్రహం చుట్టూ ఉన్న పరిసరాలు, తీరం వెంట వీచే సముద్రపు గాలి మిమ్మల్ని మైమరపిస్తాయి.

3.కొల్లూరు – శ్రీ మూకాంబికా దేవాలయం:

శ్రీ మూకాంబికా దేవిని దర్శించుకునే అరుదైన అవకాశం ఇది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తులు కలిసి ఉన్న లింగం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రదేశం అంతులేని శక్తితో నిండి ఉందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ మీరు దైవత్వాన్ని, ప్రకృతిని ఒకేచోట అనుభవించవచ్చు.

4.శృంగేరి – శారదాంబ, విద్యాశంకర దేవాలయం:

ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొదటి పీఠం అయిన శృంగేరి, జ్ఞానానికి, వేదాంతానికి కేంద్రం. ఇక్కడ జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు. శ్రీ విద్యాశంకర దేవాలయం కూడా చూడదగిన ప్రదేశం. ఈ పవిత్ర భూమిలో అడుగు పెడితే, ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రశాంతత మిమ్మల్ని చుట్టుముడతాయి.

5.హొరనాడు – శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం:

అన్నం పరబ్రహ్మ స్వరూపమని చాటి చెప్పే శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం హొరనాడులో కొలువై ఉంది. ఇక్కడ దేవిని పూజించిన వారికి అన్న వస్త్రాలకు కొదవ ఉండదని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి జాతి, మత, కుల భేదం లేకుండా ఉచితంగా భోజనం అందిస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.

6.ధర్మస్థల – శ్రీ మంజునాథ ఆలయం:

ధర్మానికి, మానవత్వానికి ప్రతీక అయిన ధర్మస్థల ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రం. శ్రీ మంజునాథ స్వామిని పూజించే ఈ ఆలయం, మత భేదం లేకుండా అందరినీ ఆహ్వానిస్తుంది.

7.కుక్కి- సుబ్రహ్మణ్య దేవాలయం:

సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం, మీ మనసుకు ప్రశాంతతను అందించే పవిత్ర స్థలం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సర్పాల అధిపతిగా పూజిస్తారు. దోష నివారణ కోసం ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా, మీలోని భయాలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు.

8.శ్రీరంగపట్నం – రంగనాథస్వామి ఆలయం

శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇది కావేరీ నది మధ్యలో ఉన్న శ్రీరంగపట్నం ద్వీపంలో ఉంది. ఈ ఆలయం ఆది రంగంగా ప్రసిద్ధి చెందింది, అంటే కావేరీ నది తీరంలోని పంచరంగ క్షేత్రాలలో ఇది మొదటిది.

9.మైసూరు – చాముండేశ్వరి శక్తిపీఠం

మైసూరు నగరానికి సమీపంలో ఉన్న చాముండి కొండపై కొలువైన శ్రీ చాముండేశ్వరి ఆలయం, కర్ణాటక యాత్రలోని అత్యంత ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఇది మైసూరు మహారాజులైన వడయార్ రాజవంశీకుల కులదేవత.

10.ఉడుపి శ్రీ కృష్ణ మందిరం.
ఇది కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. శ్రీ కృష్ణుడు బాల రూపంలో ఇక్కడ పూజలందుకుంటాడు. ద్వారక నుండి తెచ్చిన శ్రీకృష్ణుని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మధ్వాచార్యులచే స్థాపించబడిన ఈ మఠం అష్ట మఠాలకు నిలయం. ఇక్కడ అన్నదానం, భక్తి కార్యక్రమాలు నిత్యం జరుగుతాయి.
11.బేలూరు చెన్నకేశవ దేవాలయం (Beluru Chennakeshava Temple):
కర్ణాటకలోని బేలూరులో ఉన్న ఈ దేవాలయం హోయసల శిల్పకళకు ప్రతీక. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయం చెన్నకేశవుని రూపంలో పూజలందుకుంటుంది. ఆలయ గోడలపై సూక్ష్మమైన శిల్పాలు, పురాణ గాథలు చెక్కబడి ఉంటాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

**కర్ణాటక యాత్ర నియమాలు.**

ప్రతి యాత్రలో ఉండే నియమ నిభందనలు వివరంగా ఇక్కడ వివరంగా  చదవండి. https://ramthamedia.in/shree-tours-yatra-packages-terms-and-conditions/

డ్రైవర్ టిప్ గా డ్రైవర్ కు ప్రతి ఒక్కరు రూ.100 పేచేయవలెను.

కర్ణాటక యాత్రలో టెంపో ట్రావెలర్ లో ముందు 2 వరుసల ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ కు ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలి 1 వరుస వెనక్కి జరగాలి. యాత్ర బుకింగ్ కు చివరి తేధి 27-9-2026 ..

యాత్రలో వెహికిల్ పార్కింగ్ వరకే వస్తుంది.వెహికిల్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు యాత్రికులే భరించవలెను.

యాత్రలో టెంపుల్స్ లలో ఇచ్చిన సమయం మేరకు దర్శనం చేసుకుని రావలెను , యాత్రలో ఉన్న టెంపుల్స్ పక్రుతి,వర్షం,ట్రాఫిక్ జాం,యాత్రికులు లేట్ కారణంగా సమయాను కూలంగా ఏ టెంపుల్ దర్శనం అయిన మిస్ అయితే తరువాత టెంపుల్ కువెళుతాము.అంతిమ నిర్ణయం టూర్ అపరేటర్ దే. టెంపుల్స్ లలో పూజలు,స్పెషల్ దర్శనాల చార్జీలు అదనం.


Share your love
A. Ravinder, RamthaMedia
A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

Articles: 456