జీవితకాలంలో ప్రతి హిందువూ ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే మహా పుణ్యక్షేత్రాల సమాహారం ఈ యాత్ర. పితృ దేవతలకు మోక్షాన్ని ప్రసాదించే గయ, పాపాలను హరించే కాశీ, మరియు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు నడయాడిన అయోధ్యను కలుపుతూ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను మీకోసం అందిస్తున్నాము. సంప్రదించండి: శ్రీ టూర్స్ మొబైల్ నెంబర్: 8985246542
ప్రయాణ వివరాలు: ఈ పవిత్ర యాత్ర 6-10-2026 ఉదయం హైదరాబాద్ నుండి ఫ్లైట్ ద్వారా ప్రారంభమవుతుంది. అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం ముగిసిన అనంతరం, తిరిగి 10-10-2026 న అయోధ్య నుండి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది.
ఈ యాత్రలో మనం సందర్శించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మరియు వాటి విశేషాలు:
ప్రయాగ్‌రాజ్ (త్రివేణి సంగమం) భూలోకంలో అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థాలలో ప్రయాగ్‌రాజ్ ఒకటి. ఇక్కడ గంగా, యమునా మరియు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల కలయిక జరుగుతుంది. ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్ర సందర్శనతో మన యాత్ర ఆధ్యాత్మికంగా మొదలవుతుంది.
మాధవేశ్వరి శక్తిపీఠం (అలోపీ దేవి ఆలయం) త్రివేణి సంగమానికి సమీపంలోనే ఉన్న అలోపీ బాగ్ ప్రాంతంలో కొలువైన మహా శక్తిపీఠం ఇది. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు కీర్తించిన అష్టాదశ (18) శక్తిపీఠాలలో ప్రయాగ్‌రాజ్‌లోని ఈ మాధవేశ్వరి శక్తిపీఠం కూడా ఒకటి.
- పురాణ నేపథ్యం: దక్షయజ్ఞ సమయంలో అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి భౌతిక కాయాన్ని పరమశివుడు మోసుకెళ్తున్నప్పుడు, శ్రీ మహావిష్ణువు ప్రయోగించిన సుదర్శన చక్రం వల్ల ఆమె శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అందులో సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన ప్రదేశమే ఈ ప్రయాగ్‌రాజ్ అని పురాణాలు చెబుతున్నాయి.
- ఆలయ విశిష్టత (విగ్రహం లేని గుడి): ఈ శక్తిపీఠం యొక్క అతి పెద్ద విశేషం ఏమిటంటే.. గర్భగుడిలో అమ్మవారికి ఎటువంటి విగ్రహం (మూర్తి) ఉండదు. గర్భగుడి మధ్యలో ఒక చెక్క ఉయ్యాల (ఝూలా) లేదా చెక్క పీఠం ఉంటుంది. ఆ ఉయ్యాలనే సాక్షాత్తు మాతా మాధవేశ్వరి (అలోపీ దేవి) గా భక్తులు పూజిస్తారు.
గయ మరియు బోధ్ గయ (పితృ ముక్తి క్షేత్రం)
- మహాలయ అమావాస్య విశిష్టత: గయలో పితృ పిండప్రదాన మహా పుణ్యం
- భాద్రపద మాసంలో వచ్చే పితృ పక్షాల (మహాలయ పక్షాలు) ముగింపు రోజే ‘మహాలయ అమావాస్య’. హిందూ ధర్మంలో పితృదేవతలను (స్వర్గస్తులైన పెద్దలను) స్మరించుకుంటూ, వారికి తర్పణాలు వదలడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలు భూలోకానికి వచ్చి తమ వంశీకులు అందించే నైవేద్యాల కోసం ఎదురుచూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజున వారికి శ్రద్ధగా పిండప్రదానం చేయడం వల్ల వారు పూర్తి తృప్తి చెంది, తమ వంశం వృద్ధి చెందాలని దీవిస్తారు.
- గయలో పిండప్రదాన ప్రాముఖ్యత: ఇంతటి విశిష్టమైన మహాలయ అమావాస్య పర్వదినాల సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్న ‘గయ’ మహా క్షేత్రంలో పెద్దలకు పిండప్రదానం చేయడం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. పవిత్ర ఫల్గుణీ నదీ తీరాన ఉన్న విష్ణుపాదాల వద్ద పితృకర్మలు ఆచరిస్తే, వంశంలోని ఏడు తరాల పితృదేవతలకు నరక బాధల నుండి శాశ్వత విముక్తి లభించి, నేరుగా వైకుంఠ ప్రాప్తి (మోక్షం) సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కాశీ యాత్రలో గయలో చేసే ఈ పితృ కర్మకు మించిన ఆధ్యాత్మిక సంతృప్తి మరొకటి లేదు.యాత్రా షెడ్యూల్‌లో భాగంగా 7-10-26న గయలో ఉదయం పిండ ప్రధాన ఏర్పాట్లు ఉంటాయి.పండిట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.యాత్రికులు ఈ అరుదైన మరియు మహా పుణ్యప్రదమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పితృదేవతల సంపూర్ణ ఆశీస్సులు పొందవచ్చు.
- సర్వమంగళ గౌరీ ఆలయం (అష్టాదశ శక్తి పీఠం) గయలోని మంగళ గౌరి కొండపై కొలువైన ఈ ఆలయం అష్టాదశ (18) మహా శక్తి పీఠాలలో ఒకటి. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీర భాగాలలో ‘స్తన భాగం’ (వక్షస్థలం) ఇక్కడే పడిందని పురాణ గాథ. అందుకే ఈ తల్లి తన భక్తులను కన్నబిడ్డల వలె సాకి, సర్వమంగళాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు సౌభాగ్యం, సుఖశాంతుల కోసం ఈ మాతను ప్రత్యేకంగా దర్శించుకుంటారు.
- బోధ్ గయ (జ్ఞానోదయ క్షేత్రం) హిందువులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు బోధ్ గయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. యువరాజు సిద్ధార్థ గౌతముడు కఠోర ధ్యానం చేసి ‘గౌతమ బుద్ధుడిగా’ జ్ఞానోదయం పొందిన పవిత్రమైన రావి చెట్టు (బోధి వృక్షం) ఇక్కడే ఉంది. ఆ వృక్షం పక్కనే ఉన్న ప్రసిద్ధ ‘మహాబోధి దేవాలయం’, గర్భగుడిలోని బుద్ధుని ప్రశాంత రూపం యాత్రికులకు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయి.
కాశీ – వారణాసి (దివ్య క్షేత్ర దర్శనం) పరమశివుని రాజధాని అయిన కాశీ మహాక్షేత్రంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల దర్శనం ఉంటుంది:
- శ్రీ కాశీ విశ్వనాథ మందిరం (మోక్ష ప్రదాత) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానమైన శ్రీ కాశీ విశ్వనాథం సాక్షాత్తు పరమశివుడి నిలయం. గంగా తీరాన ఉన్న ఈ బోళా శంకరుడిని కన్నులారా దర్శించుకుని, ఆ లింగాన్ని తాకితే జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి (మోక్షం) లభిస్తుందని ప్రతీతి. గుడి ప్రాంగణంలో నిరంతరం మార్మోగే ‘హర హర మహాదేవ’ నామస్మరణలు భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి.
- శ్రీ అన్నపూర్ణా దేవి ఆలయం (జగన్మాత సన్నిధి) కాశీలో అడుగుపెట్టిన జీవులందరికీ కడుపు నింపే కరుణామూర్తి శ్రీ అన్నపూర్ణా దేవి. సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసిన ఈ మహా తల్లి గురించి “కాశీలో ఎవరూ ఆకలితో పడుకోరు” అని చెబుతారు. అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మహా ప్రసాదం స్వీకరిస్తే జీవితంలో అన్నపానాలకు, సిరిసంపదలకు ఎన్నడూ లోటు ఉండదని భక్తుల విశ్వాసం.
- శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు (మహా శక్తి పీఠం) అష్టాదశ (18) శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో సతీదేవి కుడి చెవిపోగు పడిందని పురాణాలు చెబుతున్నాయి. వారణాసి నగరమంతటికీ దివ్యమైన శక్తినిచ్చే ఈ మహాతల్లిని కన్నులారా దర్శించుకుని కుంకుమార్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీ సందుల్లో కొలువైన ఈ ఆలయ వాతావరణం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది.
- శ్రీ కాలభైరవ స్వామి (కాశీ కొత్వాల్) ఈ స్వామిని కాశీ నగరానికి రక్షక భటుడు (కొత్వాల్) అని భక్తితో పిలుస్తారు. శివుని ఉగ్ర రూపమైన కాలభైరవుని అనుమతి, దర్శనం చేసుకోకుండా ఎంతటి వారికైనా కాశీ యాత్ర సంపూర్ణం కాదు. ఈ స్వామి ఆశీస్సులు పొంది, ఇక్కడ రక్షా కంకణం (నల్ల దారం) కట్టుకోవడం వల్ల దుష్ట గ్రహదోషాలు తొలగిపోయి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
- పవిత్ర గంగా నదీ స్నానం మరియు మహా హారతి కాశీ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించడం. గంగా భవానిలో భక్తితో ఒకసారి మునక వేస్తే గత జన్మల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. అలాగే, స్నానం అనంతరం దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రతిరోజూ సాయంత్రం వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగే ‘గంగా హారతి’ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసి దైవత్వపు అంచులకు తీసుకెళ్తుంది.
అయోధ్య (శ్రీరామ జన్మభూమి – సప్త మోక్షపురులలో మొదటిది) మన యాత్ర చివరి దశలో మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించి, నడయాడిన పుణ్యభూమి అయోధ్య చేరుకుంటాము. హిందూ పురాణాల ప్రకారం మానవులకు జన్మల నుండి మోక్షాన్ని ప్రసాదించే ఏడు పవిత్ర నగరాలు (సప్త మోక్షపురులు – అయోధ్య, మథుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక) ఉన్నాయి. వీటిలో అయోధ్య మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది. సాక్షాత్తు ఆ వైకుంఠమే భూమిపై అయోధ్యగా అవతరించిందని, ఇక్కడ అడుగుపెడితేనే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని క్షేత్ర మహత్యం చెబుతోంది. పవిత్ర సరయూ నదీ తీరంలో ఉన్న ఈ నగరం అడుగడుగునా రామనామంతో మార్మోగుతుంటుంది. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మనం అయోధ్యలో ఒక రాత్రి బస చేస్తాము.
హనుమాన్ గర్హి (హనుమాన్ టెంపుల్) అయోధ్య నగరానికి ఆంజనేయ స్వామి రక్షకుడిగా ఉంటాడు. ఇక్కడ శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించి, హనుమంతుడి అనుమతి తీసుకోవడం పురాతన సంప్రదాయం. ఎత్తైన ప్రదేశంలో కొలువైన ఈ ఆలయంలోని మారుతి దర్శనం సకల సంకటాలను తొలిగించి, అపారమైన మనోబలాన్ని ఇస్తుంది.
శ్రీరామ జన్మభూమి (బాల రాముని దర్శనం) హనుమంతుని ఆశీస్సులు పొందిన అనంతరం ఉదయాన్నే నూతనంగా, అత్యంత వైభవంగా నిర్మించిన అయోధ్య శ్రీరామ మందిరాన్ని సందర్శిస్తాము. గర్భగుడిలో కొలువైన అందమైన “బాల రాముని” (రామ్ లల్లా) దివ్య మంగళ రూపాన్ని కన్నులారా చూసి తరించడం ఈ యాత్రలో ఒక మధురమైన, జీవితకాల అనుభూతి.
యాత్రా ప్యాకేజీ వివరాలు మరియు షరతులు:
- యాత్ర పూర్తి సూచనలు మరియు నియమ నిబంధనలు ఇక్కడ చదవండి: https://ramthamedia.in/shree-tours-yatra-packages-terms-and-conditions/
- గుర్తింపు కార్డులు: విమాన ప్రయాణం మరియు హోటల్ చెక్-ఇన్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఒరిజినల్ ఓటర్ ఐడి (ప్రభుత్వం పోస్టులో పంపిన అసలైన కార్డులు) లేదా పాస్‌పోర్ట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. లామినేట్ చేసిన కలర్ జిరాక్స్‌లు అనుమతించబడవు.
- ప్రయాణ మార్గం: ఈ యాత్రలో హైదరాబాద్ నుండి ప్రయాగ్‌రాజ్ కు, అలాగే తిరుగు ప్రయాణంలో అయోధ్య నుండి హైదరాబాద్ కు నేరుగా ఫ్లైట్ (విమానం) ద్వారా ప్రయాణం ఉంటుంది.
- స్థానిక ప్రయాణం మరియు బస: యాత్రికుల సంఖ్యను బట్టి స్థానికంగా అన్ని క్షేత్రాలు తిరగడానికి బస్సు లేదా టెంపో ట్రావెలర్ (ఏసీ) ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబానికి (2-3 పర్సన్స్) ఒక హోటల్ రూమ్ కేటాయించబడుతుంది.
- భోజన సదుపాయం: యాత్రలో ప్రతిరోజూ ఉదయం టీ/టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్, సాయంత్రం టీ, రాత్రి భోజనం మా తరపున అరేంజ్ చేయబడుతుంది. విమాన ప్రయాణ సమయంలో మాత్రం భోజన సదుపాయం ఉండదు (యాత్రికులు స్వయంగా చూసుకోవాలి). ప్రయాగ్‌రాజ్ చేరుకున్నప్పటి నుండి తిరిగి అయోధ్యలో ఫ్లైట్ ఎక్కే వరకు మొత్తం భోజన బాధ్యత మాదే.
- హోటల్ బస వివరాలు: మొత్తం 4 రాత్రులు నాన్ ఎ.సి. హోటల్ రూం స్టే ఉంటుంది (1 నైట్ బోధ్ గయ, 2 నైట్స్ కాశీ, 1 నైట్ అయోధ్య). యాత్రకు ఒంటరిగా (సింగిల్ గా) వచ్చేవారికి ప్రత్యేకంగా సింగిల్ రూమ్ కేటాయింపు కావాలంటే రూ. 3000 అదనంగా చెల్లించాలి. ఎ.సిరూంలకు ఒక్కిరిక రూ.2000 అదనం 4 రాత్రులకు కలపి…
- బస్సులో సీట్ల కేటాయింపు: బస్సు/ట్రావెలర్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ కావాలనుకునేవారు ఒక్కరికి రూ. 800 అదనంగా చెల్లించాలి. మిగతా యాత్రికులు ప్రతిరోజూ ఒక వరుస వెనక్కి జరగాల్సి ఉంటుంది (రొటేషన్ పద్ధతి).
- దర్శన సమయాలు: సమయాభావం, ట్రాఫిక్ సమస్యలు లేదా ఆలయాల్లో అధిక రద్దీ కారణంగా మధ్యలో ఏదేని టెంపుల్ దర్శనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి విమాన సమయానికి చేరుకోవాలి కాబట్టి, టూర్ ఆపరేటర్ ఇచ్చిన సమయానికి యాత్రికులు కచ్చితంగా వాహనం వద్దకు రావాలి.
- అదనపు ఖర్చులు: మన వాహనం వెళ్ళని చోట్లకు షేరింగ్ ఆటో ఛార్జీలు, గంగా నదిలో బోటు ప్రయాణం, స్పెషల్ దర్శనాలు (కాశీ విశ్వనాథ్, అయోధ్య రామమందిరం తదితర), పూజలు, గయలో పిండప్రదాన కర్మల ఖర్చులు మరియు అభిషేక ఛార్జీలు యాత్రికులదే బాధ్యత.
- డ్రైవర్ టిప్: డ్రైవర్ టిప్ కింద ఒక్కొక్కరు రూ. 150 అదనంగా చెల్లించవలెను.
- బుకింగ్ మరియు చెల్లింపు వివరాలు: బుకింగ్స్ కోసం సంప్రదించండి – శ్రీ టూర్స్: 8985246542. సీటు నిర్ధారణ కోసం నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 ను Gpay/Phonepe (8985246542 -A.Ravinder,) ద్వారా చెల్లించాలి. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ రూ. 11,000 + డ్రైవర్ టిప్ రూ. 100 ప్రయాగ్‌రాజ్ చేరుకోగానే క్యాష్ గా పే చేయాలి. (గమనిక: మొత్తం ప్యాకేజీ రూ. 31,000. అప్ డౌన్ విమాన ఛార్జీలు రూ. 15,000 దాటితే ఆ అదనపు ఖర్చు యాత్రికులే చెల్లించాలి).
- ఈయాత్రతోపాటు కంబైన్డ్ గా నేపాల్ యాత్రను కూడా దర్శించుకోవచ్చును.